Chiranjeevi: వరప్రసాద్ గారికి ఫిదా అయిన బన్నీ.. ఎమోషనల్ అయిన చిరు

ABN , Publish Date - Jan 20 , 2026 | 05:14 PM

చాలా గ్యాప్ తరువాత మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మన శంకరవరప్రసాద్ గారు (Mana Shankara VaraPrasad Garu) సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు.

Chiranjeevi

Chiranjeevi: చాలా గ్యాప్ తరువాత మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మన శంకరవరప్రసాద్ గారు (Mana Shankara VaraPrasad Garu) సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకోవడమే కాకుండా రూ. 300 కోట్లకు పైగా కలక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో వెంకటేష్ స్పెషల్ రోల్ లో నటించి మెప్పించాడు. చిరు వింటేజ్ కామెడీ, లుక్, ప్రేక్షకులను థియేటర్ వైపుకు తీసుకెళ్లాయి.

ఇక తాజాగా ప్రేక్షకులను తనపై, తన సినిమాపై చూపిస్తున్న ప్రేమకు చిరు ముగ్దుడయ్యారు. వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్ లో ఒక ఎమోషనల్ నోట్ ని రిలీజ్ చేశారు. ' మన శంకరవరప్రసాద్ గారు" చిత్రంకి ప్రేక్షక దేవుళ్లు చూపిస్తున్న ఆదరణ మరియు అపూర్వమైన విజయాన్ని చూస్తుంటే నా మనసు కృతజ్ఞత భావనతో నిండిపోతోంది. నేను ఎప్పుడూ చెప్పేది నమ్మేది ఒక్కటే - నా జీవితం మీ ప్రేమాభిమానాలతో ముడిపడింది. మీరు లేనిదే నేను లేను. ఈ రోజు మళ్లీ అదే నిజమని మీరు నిరూపించారు.ఈ విజయం పూర్తిగా నా ప్రియమైన తెలుగు ప్రేక్షకులది, నా ప్రాణసమానమైన అభిమానులది, నా డిస్ట్రిబ్యూటర్లది, సినిమాకు ప్రాణం పెట్టి పనిచేసిన ప్రతీ ఒక్కరిది మరియు ముఖ్యంగా దశాబ్దాలుగా నా వెంట నిలబడి ఉన్నవారందరిది.

వెండితెర మీద నన్ను చూడగానే మీరు వేసే విజిల్స్, చప్పట్లే నన్ను నడిపించే నా శక్తి. రికార్డులు వస్తుంటాయి – పోతుంటాయి, కానీ మీరు నాపై కురిపించే ప్రేమ మాత్రం శాశ్వతం.ఈ బ్లాక్బస్టర్ విజయం వెనుక ఎంతో కృషి చేసిన మా దర్శకుడు HIT MACHINE అనిల్ రావిపూడికి, నిర్మాతలు సాహు & సుస్మితలకు, అలాగే మొత్తం టీమ్ అందరికీ, నాపై మీరందరూ చూపిన అచంచలమైన నమ్మకానికి ధన్యవాదాలు.. ఈ సంబరాన్ని అలాగే కొనసాగిద్దాం. మీ అందరికీ ప్రేమతో…… లవ్ యూ ఆల్' అంటూ రాసుకొచ్చారు.

ఇక ఇంకోపక్క అభిమానులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం.. బాస్ సినిమాకు రివ్యూ ఇచ్చాడు. 'మన శంకరవరప్రసాద్ గారు చిత్ర బృందానికి శుభాకాంక్షలు. బాస్ ఈజ్ బ్యాక్. వింటేజ్ వైబ్స్ తో మన చిరంజీవి గారు ఇలా స్క్రీన్ మీద కనిపించడం చాలా ఆనందంగా ఉంది. వెంకటేష్ గారు.. అదరగొట్టేశారు. నయనతార, క్యాథరిన్ థెరిస్సా చాలా అద్భుతంగా నటించారు. ముఖ్యంగా సంక్రాంతిస్టార్ బుల్లిరాజు ఎనర్జీ సూపర్. భీమ్స్ అందించిన సాంగ్స్ చాలా బావున్నాయి. ఈ సినిమా కోసం పనిచేసిన టెక్నీషియన్స్ అందరికి శుభాకాంక్షలు. సంక్రాంతి బ్లాక్ బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడికి శుభాకాంక్షలు, సంక్రాంతికి వస్తాడు.. హిట్ కొడతారు.. రీపీట్. ఇది కేవలం సంక్రాంతి బ్లాక్ బస్టర్ కాదు.. సంక్రాంతి బాస్ బస్టర్' అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారాయి.

Updated Date - Jan 20 , 2026 | 05:14 PM