చిరంజీవి: ఉగాదికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో అన్నీ శుభాలే!

ABN , Publish Date - Mar 15 , 2026 | 04:10 PM

'మ్యాజిక్ జరిగింది..  ముహూర్తం కుదిరింది..  ట్రైలర్ అదిరింది..  ఉగాదికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో అన్నీ శుభాలే’ 

'మ్యాజిక్ జరిగింది.. 

ముహూర్తం కుదిరింది.. 

ట్రైలర్ అదిరింది.. 

ఉగాదికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో (ustaad Bhagt singh) అన్నీ శుభాలే’ 

అంటూ తన సోదరుడు పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పవన్ హీరోగా నటించిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌ను  శనివారం  విడుదల చేశారు. ‘ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం..’ అంటూ పవన్ చెప్పిన డైలాగులు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అంచనాల్ని రెట్టింపు  చేశాయి. ట్రైలర్ ను వీక్షించిన చిరు... పవన్ కు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. 

రామ్ చరణ్ కూడా ట్రైలర్ చూసి ప్రశంసలు కురిపించారు. 'ట్రైలర్ టెర్రిఫిక్ గా ఉందన్నారు.  కళ్యాణ్ బాబాయ్ ఎనర్జీ, స్వాగ్  సూపర్. హరీష్ శంకర్ పర్ఫెక్ట్ గా బాబాయ్ ని ప్రెసెంట్ చేశారు. ఉగాదికి ఉస్తాద్ సెలెబ్రేషన్స్ కోసం ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్నా' అని రామ్ చరణ్ పేర్కొన్నారు. అలాగే పలువురు దర్శకులు, స్టార్స్ కూడా పోస్ట్ లు పెట్టారు. 


'మార్చి 19న పవర్‌స్టార్‌ పవర్‌ బ్లాస్ట్‌కు అందరూ సిద్ధంగా ఉండండి’

సుజీత్‌

‘ట్రైలర్ బద్దలైపోయింది. పవన్ కళ్యాణ్‌ని హరీశ్‌ అన్న చూపించే విధానం ఎప్పుడూ పండగలా ఉంటుంది. ఆ స్టైల్, ఆ యాటిట్యూడ్ అద్భుతం. ఈ మార్చి 19న వెండితెరపై పవన్‌ ‘మాస్ షో’ చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. సెన్సేషన్ గ్యారెంటీ’ 

అనిల్‌ రావిపూడి

‘డియర్‌ హరీశ్‌ శంకర్‌ సర్.. 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌' ట్రైలర్‌ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. మూవీ లవర్స్ కి  ఇది సూపర్‌ ట్రీట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పటిలాగే యంగ్‌గా, డైనమిక్‌గా కనిపిస్తున్నారు. మళ్లీ  పాత రోజులను గుర్తు చేస్తున్నారు’ - 

- బుచ్చిబాబు  సానా 


‘ హరీశ్‌ శంకర్ బ్రో.. ఇచ్చి పడేశావ్ అంతే! వింటేజ్ పవర్ స్టార్ మాస్ వైబ్స్ మళ్లీ కనిపిస్తున్నాయి. కల్యాణ్‌ బాబాయ్ మేనరిజమ్స్, స్టైల్ మరోస్థాయిలో ఉన్నాయి. ఈ మాస్ జాతరను బిగ్ స్క్రీన్‌పై చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా'

వరుణ్‌ తేజ్‌

Updated Date - Mar 15 , 2026 | 09:46 PM