‘రయ్‌.. రయ్‌..' సాంగ్‌కు చిరు ప్రశంస.. దర్శకుడు ఏమన్నారంటే...

ABN , Publish Date - Mar 03 , 2026 | 05:03 PM

‘పెద్ది’ సినిమా నుంచి సోమవారం సాయంత్రం రెండో పాటను విడుదల చేశారు. ‘రయ్‌.. రయ్‌.. రారా’ అంటూ సాగే ఈ పాట సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయింది.

‘పెద్ది’ (peddi) సినిమా నుంచి సోమవారం సాయంత్రం రెండో పాటను విడుదల చేశారు. ‘రయ్‌.. రయ్‌.. రారా’ (Rai rai Raa raa) అంటూ సాగే ఈ పాట సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయింది. రామ్‌చరణ్‌ స్పీడ్‌ డాన్స్‌కు ఫ్యాన్స్‌, నెటిజను ఫిదా అవుతున్నారు. ఇప్పటికే ఈ పాటకు 18 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. ఈ పాట గురించి చిరంజీవి (Chiranjeevi) ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు. ‘రయ్‌ రయ్‌ రారా’ సాంగ్‌  స్క్రీన్ పై  ఫైర్‌లా ఉందని చిరంజీవి పోస్టులో పేర్కొన్నారు. ‘ఎనర్జీ, ఎమోషన్‌తో కూడిన అద్భుతం ఇది. చరణ్‌ డాన్స్‌, గ్రేస్‌, డాన్స్‌లో వేగం చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌, గేయ రచయిత అనంత శ్రీరామ్‌, కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌, దర్శకుడు బుచ్చిబాబు, సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు టీమ్‌ అందరికీ అభినందనలు’ అని చిరంజీవి ట్వీట్‌లో పేర్కొన్నారు.

చిరంజీవి పోస్ట్‌కు కృతజ్ఞతలు చెబుతూ దర్శకుడు బుచ్చిబాబు సానా స్పందించారు. ‘ఆ రోజు ఇంకా గుర్తుంది సర్‌. ఈ బీజీఎం షూటింగ్‌ చేస్తున్నప్పుడు చరణ్‌ తీవ్రమైన జ్వరంతో ఉన్నారు. మేం షూటింగ్‌ ఆపేద్దామన్నా.. ఆయన ‘లేదు చేద్దాం’ అని అన్నారు. అంత జ్వరంలోనూ చిరునవ్వుతో, ఎంతో గ్రేస్‌తో డ్యాన్స్‌ చేశారు. ఆ డెడికేషన్‌ అన్నీ మీ నుంచి వచ్చినవే సర్‌’ అని బుచ్చిబాబు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర నేపథ్యంతో స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. జాన్వీకపూర్‌ కథానాయిక. ఏప్రిల్‌ 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  
 
 

Updated Date - Mar 03 , 2026 | 06:25 PM