Chiranjeevi: ఎన్ని తరాలు మారినా ఆయన ప్రభావం చెరిగిపోదు

ABN , Publish Date - May 28 , 2026 | 12:25 PM

‘ఎన్ని తరాలు మారినా తారక రాముని ప్రభావం చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోదు’ అన్నారు మెగాస్టార్‌ చిరంజీవి.

Chiranjeevi Tribute to NTR

‘ఎన్ని తరాలు మారినా తారక రాముని (NTR) ప్రభావం చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోదు’ అన్నారు మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi). దివంగత నటుడు నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్‌ను ఆయన స్మరించుకున్నారు. ఆయనతో దిగిన ఫొటోను ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేసి నివాళులు అర్పించారు.

‘అందరి హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించిన ఎన్టీఆర్‌ చిరస్మరణీయులు. ఎన్ని తరాలు మారినా ఆ తారక రాముని ప్రభావం చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోదు. తెరపై అనేక  ఎన్నో పాత్రలను సజీవంగా ఆవిష్కరించిన మహానటుడు ఆయన. ప్రజాజీవితంలో తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారు. అందరి హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇటీవళ ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారం నాకు దక్కడం ఎంతో ప్రత్యేకమైన గౌరవంగా భావిస్తున్నాను. అది ఆయనపై నాకు ఉన్న గౌరవానికి మరింత విలువైన గుర్తింపుగా నిలిచిపోతుంది’ అని చిరంజీవి ట్వీట్‌ చేశారు.

గురువారం ఉదయాన్నే ఎన్టీఆర్‌ గార్డెన్స్‌లో నందమూరి తారకరామారావు ఘాట్‌ వద్దకు చేరుకుని నివాళి అర్పించారు జూనియర్‌ ఎన్టీఆర్‌. అలాగే సోషల్‌ మీడియా వేదికగా ఎన్టీఆర్‌ను తలచుకుంటూ కొందరు సినీ, రాజకీయ ప్రముఖులు పోస్టులు పెట్టారు. 

Updated Date - May 28 , 2026 | 12:28 PM