Chiranjeevi: అంబాసిడర్‌గా చిరంజీవి.. నిజమెంత?

ABN , Publish Date - Aug 06 , 2026 | 03:02 PM

అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) ఆంధ్రప్రదేశ్ అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన టీమ్ ఖండించింది.

అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) ఆంధ్రప్రదేశ్ అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన టీమ్ ఖండించింది. అందులో ఎలాంటి నిజం లేదని తెలిపింది. ఈ మేరకు చిరంజీవి టీమ్ ఎక్స్ (X) వేదికగా స్పందిస్తూ 'సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌కు సంబంధించిన వార్తలు పూర్తిగా అవాస్తవం. దయచేసి ఇలాంటి అసత్య  అసత్య ప్రచారాలను నమ్మవద్దు' అని కోరింది. దీంతో గత కొద్ది గంటలుగా వైరల్ అవుతున్న వార్తలకు తెరపడింది. చిరంజీవి ప్రస్తుతం దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'విశ్వంభర' త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. 

Updated Date - Aug 06 , 2026 | 03:08 PM