Mana Shankara var Prasad Garu: ‘మన శంకరవరప్రసాద్ గారు’ సెన్సార్ పూర్తి

ABN , Publish Date - Jan 06 , 2026 | 08:55 PM

మన శంకరవరప్రసాద్ (Mana Shankara var Prasad Garu) యమ జాగ్రత్తగా ఉన్నాడు. మాస్‌నే కాకుండా క్లాస్ అభిమానులందరినీ థియేటర్ కు రప్పించేందుకు బిగ్ స్కెచ్ వేసుకున్నాడు.

Mana Shankara var Prasad Garu

Mana Shankara var Prasad Garu: మన శంకరవరప్రసాద్ (Mana Shankara var Prasad Garu) యమ జాగ్రత్తగా ఉన్నాడు. మాస్‌నే కాకుండా క్లాస్ అభిమానులందరినీ థియేటర్ కు రప్పించేందుకు బిగ్ స్కెచ్ వేసుకున్నాడు. క్లీన్ ఎంటర్ టైనర్ తో బాక్సాఫీస్ ను బ్లాస్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

సంక్రాంతి పండుగ సీజన్‌లో టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి వస్తున్న మూవీల్లో ‘మన శంకరవరప్రసాద్ గారు’ ఒకటి. మెగాస్టార్ చిరంజీవి నటించిన హైలీ అంటిసిపేటెడ్ ఫిల్మ్ విడుదలకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ఇప్పటికే విడుదలైన ప్రతి ప్రోమో, సాంగ్స్, అప్‌డేట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలవడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. ఈ మూవీకి సంబంధించి తాజాగా ముఖ్యమైన అప్డేట్ వచ్చింది.

హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందిచిన ఈ చిత్రానికి, తాజాగా సెన్సార్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి కాగా, యూ/ఏ సర్టిఫికెట్ లభించింది.ఇక మేకర్స్ సినిమా నిడివిని 2 గంటల 42 నిమిషాలుగా ఫిక్స్ చేశారు. దీంతో రెండున్నర గంటలకుపై బిగ్ బాస్ బిగ్ స్క్రీన్ పై రఫ్పాడించడం ఖాయమని అనుకుంటున్నారు అభిమానులు. ఫ్యామిలీ వీక్షకులతో పాటు యంగ్ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకునే విధంగా కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్ అన్నీ బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నాయనే చెప్పుకుంటున్నారు. డబుల్ మీనింగ్ జోక్స్ లేకుండా అనిల్ రావిపూడి స్టైల్ క్లీన్ హ్యూమర్‌తో సినిమా తీర్చిదిద్దారని.. అందుకే సెన్సార్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని చిత్ర యూనిట్ అంటోంది.

చిరు స్టైల్ మేనరిజమ్స్‌తో పాటు అనిల్ రావిపూడి సిగ్నేచర్ హ్యూమర్, ఎమోషనల్ ఎలిమెంట్స్ కలగలిసి ఈ పండుగ సీజన్‌కు పర్ఫెక్ట్ వినోదాన్ని అందించనున్నాయని ట్రేడ్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.చి త్రంలో చిరంజీవికి జోడీగా లేడీ సూపర్‌స్టార్ నయనతార నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్ ముఖ్యమైన గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు. చిరు-వెంకీ కలయికలో వచ్చిన పార్టీ సాంగ్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారి సూపర్ రెస్పాన్స్ సంపాదించింది.టెక్నికల్ ఫ్రంట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో సమకూర్చిన సాంగ్స్ మాస్ ఆడియెన్స్‌ను బాగా ఆకర్షించాయి.. నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఎటువంటి రాజీ లేకుండా గ్రాండ్ స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చారు..

Updated Date - Jan 06 , 2026 | 08:55 PM