మన శంకర వర ప్రసాద్ గారు.. బ్లాక్ బస్టర్ పార్టీ
ABN , Publish Date - Feb 22 , 2026 | 07:59 PM
మన శంకర వర ప్రసాద్ గారు చిత్రం భారీ విజయం సాధించిన సందర్భంగా చిరంజీవి టాలీవుడ్ పెద్దలకు పార్టీ ఇచ్చారు.
ఈ సంక్రాంతికి థియేటర్లకు వచ్చి ఇండస్ట్రీ హిట్ సాధించింది చిరంజీవి (Chiranjeevi) నటించిన మన శంకర వర ప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu) చిత్రం. అనీల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ చాలాకాలంగా ఎదురు చూస్తున్న ఆకలిని తీర్చి మెగా అభిమానులకు నాటి చిరును తిరిగి గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఫ్యాన్స్ ఈ సక్సెస్‌ను ఓ రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకున్నారు. బాస్ సైతం ఫ్యాన్స్‌ను ప్రత్యేకంగా కలవడగం, సెల్ఫీలు ఇవ్వడం, ఆపై మీడియా ప్రతినిధులకు, సెలబ్రిటీలకు విందులు కూడా ఇచ్చారు.
కాగా .. తాజాగా బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ పేరుతో చిరంజీవి ఆదివారం రాత్రి టాలీవుడ్ పెద్దలకు, తన సన్నిహితులకు పార్టీ ఇచ్చారు. తనతో గతంలో పనిచేసిన నిర్మాతలు, దర్శకులు, రాజకీయ ప్రముఖులు అనేక మంది ఈ విందుకు హజరయ్యారు. వీరిలో అల్లు అరవింద్, అశ్వినీ దత్, రాఘవేంద్రరావు, కోదండ రామిరెడ్డి, అనీల్ రావిపూడి, బీ గోపాల్, బండ్ల గణేశ్, బీవీఎస్ రవి, బాబీ కొల్లి, సురేశ్ బాబు, పొలిటీషియన్స్ రఘు రామ కృష్ణం రాజు, గంటా శ్రీనివాస రావులతో పాటు ఛాముండేశ్వరీ నాథ్ వంటి వారు ఈ పార్టీకి అటెండ్ అయ్యారు. ఇందుకు సంబంధఙంచిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. మీరూ లుక్ వేయండి మరి.