Ramcharan: ట్విన్స్ వ‌చ్చిన వేళ‌... ఫ్యాన్స్‌కు రామ్‌చరణ్‌ సర్‌ప్రైజ్ గిఫ్ట్స్

ABN , Publish Date - Feb 04 , 2026 | 09:27 AM

ఇటీవ‌ల మెగా వారి ఇంట క‌వ‌ల‌లు అడుగుపెట్టి వారి ఫ్యామిలీలో స‌రికొత్త ఆనందాన్ని తీసుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

ramcharan

ఇటీవ‌ల మెగా వారి ఇంట క‌వ‌ల‌లు అడుగుపెట్టి వారి ఫ్యామిలీలో స‌రికొత్త ఆనందాన్ని తీసుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దీంతో మెగా ఇంట ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయాయి. ఇక చిరంజీవి (Chiranjeevi) అభిమానులు అయితే ప‌ట్ట‌లేనంత‌గా ఆనందంతో మురిసిపోతూ వేడుకలు జ‌రుపుకున్నారు. ఇప్ప‌టికే రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) ఉపాస‌న (Upasana Konidela) దంప‌తుల‌కు కూతురు క్లింకార ఉండ‌గా ఇప్పుడు ఓ కుమారుడు, ఓ కుమార్తె జ‌న్మించారు.

HAR8pZWbMAA7nbf.jfif

ఈ సంద‌ర్బాన్ని పుర‌స్క‌రించుకుని.. రామ్ చరణ్–ఉపాసన ఈ సంతోషాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. తమపై కురిపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతగా అభిమానులకు, త‌మ కార్యాల‌యాల్లో ప‌ని చేసే వారికి స్వీట్ బాక్సులు అందించారు.

దీనికి సంబంధించిన, ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక అభిమాని గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేస్తూ షేర్ చేసిన వీడియోలో రెండు రకాల స్వీట్లు కనిపించాయట. ఇవే కాకుండా బంధుమిత్రుల‌కు కూడా ఈ బ‌హుమ‌తులు అంద‌జేసిన‌ట్లు స‌మాచారం. వారికి పంపిన బాక్సుల్లో సిల్వ‌ర్ ప్లేట్, రెండు ర‌కాల ల‌డ్డూలు ఉన్నాయని తెలుస్తోంది.

Updated Date - Feb 04 , 2026 | 03:08 PM