రామ్ చరణ్ పుట్టినరోజు.. ఛారిటీలకు చిరు రూ. 10 లక్షలు విరాళం
ABN , Publish Date - Mar 27 , 2026 | 08:39 PM
అగ్ర కథానాయకుడు చిరంజీవి తన సహృదయాన్ని చాటుకున్నారు.
అగ్ర కథానాయకుడు చిరంజీవి తన సహృదయాన్ని చాటుకున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఉగాది పర్వ దినాన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఎన్టీఆర్ జాతీయ పురస్కారం నగదు బహుమతి రూ.10 లక్షలను వివిధ ఫౌండేషన్లకు విరాళంగా ఇచ్చారు.

అనాథ వృద్ధులను చేరదీస్తున్న సర్వ్ ఫౌండేషన్, బేగంపేట్ దేవనార్ బ్లైండ్ స్కూల్, చిన్న పిల్లలను సంరక్షిస్తున్న వాల్మీకి, నయశ్రీ ఫౌండేషన్లతో పాటు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి విరాళం అందించారు. ఇటీవల చరణ్‌ను కలిసిన వృద్ధులను బ్లడ్ బ్యాంక్‌కు ఆహ్వానించి చిరంజీవి స్వయంగా భోజనం వడ్డించారు. కొత్త బట్టలు పెట్టారు. వారితో కాసేపు ముచ్చటించారు.