ఎవరీ కుర్రాడు.. మెగాస్టార్ అంటారులే
ABN , Publish Date - May 12 , 2026 | 08:29 PM
సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ మనుగడ సాగించాలి అంటే ఫిట్ నెస్ ఉండాల్సిందే. అది హీరో అయినా, హీరోయిన్ అయినా.. అందుకే నిత్యం వారు తమ అందాన్ని కాపాడుకోవడం కోసం కష్టపడుతూనే ఉంటారు.
సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ మనుగడ సాగించాలి అంటే ఫిట్ నెస్ ఉండాల్సిందే. అది హీరో అయినా, హీరోయిన్ అయినా.. అందుకే నిత్యం వారు తమ అందాన్ని కాపాడుకోవడం కోసం కష్టపడుతూనే ఉంటారు. అయితే ఒక ఏజ్ వచ్చాకా ఎవరికైనా అందం తగ్గిపోతోంది. కానీ, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఏజ్ రివర్స్ లో వెళ్తోంది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. 70 ఏళ్ళ వయస్సులో ఆయన ఛార్మ్, ఛరిష్మా చూస్తే మతులు పోవాల్సిందే. తాజాగా చిరు లేటెస్ట్ లుక్ చూస్తే కుర్ర హీరోలు సైతం నోళ్ళు వెళ్ళబెడతారు.
చిరు నెలకోసారి కొత్త కొత్త ఫోటోషూట్స్ తో అభిమానులను అలరిస్తూ ఉంటాడు. తాజాగా ఆయన కొత్త ఫోటోషూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బ్రౌన్ డెనిమ్ జీన్స్ పై క్రీమ్ కలర్ టీ షర్ట్.. చేతిలో కళ్లద్దాలు పట్టుకొని ఊబర్ కూల్ లుక్ లో అదిరిపోయాడు. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఎవరీ కుర్రాడు అని కామెంట్స్ చేస్తుంటే.. సీనియర్ ఫ్యాన్స్ మెగాస్టార్ అంటారులే అంటూ రిప్లై ఇస్తున్నారు. ఇక చిరు సినిమాల విషయానికొస్తే ఈ ఏడాది మన శంకరవరప్రసాద్ సినిమాతో మంచి హిట్ అందుకున్న చిరు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే విశ్వంభర సినిమా రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఇక ఇది కాకుండా బాబీతో ఒక సినిమా చేస్తున్న చిరు.. దాన్ని ఫినిష్ చేసి శ్రీకాంత్ ఓదెల సినిమాను పట్టాలెక్కించనున్నాడు.