చిరు.. అక్కడ మిస్సింగ్.. ఇక్కడ ట్రెండింగ్
ABN , Publish Date - Mar 04 , 2026 | 10:10 PM
రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రశ్మిక మందన్నా (Rashmika Mandanna) ఫిబ్రవరి 26 వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెల్సిందే.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రశ్మిక మందన్నా (Rashmika Mandanna) ఫిబ్రవరి 26 వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెల్సిందే. పెళ్లి తరువాత ఈ జంట పూజలను పూర్తిచేసుకొని, ఫ్యాన్స్ ని కలిసి మార్చి 4 న రిసెప్షన్ జరుపుకున్నారు. తాజ్ హోటల్ లో వీరి రిసెప్షన్ ఘనంగా నిర్వహించారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం విరోష్ (Virosh) రిసెప్షన్ లో సందడి చేశారు.
చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, రానా, నాని, నవీన్ పోలిశెట్టి, మృణాల్ ఠాకూర్, శ్రీలీల, వెంకటేష్, నాగార్జున, నాగ చైతన్య, శ్రీకాంత్, నాగ్ అశ్విన్, సుమ, కరణ్ జోహార్, కార్తీ, శేఖర్ కమ్ముల, రవితేజ, నమ్రత,కేటీఆర్, రేవంత్ రెడ్డి భార్య తదితరులు ఈ వేడుకలో సందడి చేశారు. వీరందరూ ఓకే కానీ, చిరంజీవి.. ఈ వేడకకు రావడం ఆశ్చర్యంగా ఉందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.
చిరంజీవి విరోష్ వేడుకలో హైలైట్ గా నిలిచారు. ఎందుకు అంటే.. మార్చి 2 న చిరంజీవి మేనల్లుడు అల్లు అరవింద్ కొడుకు అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది. అల్లు స్టూడియోస్ లో ఈ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించారు అల్లు కుటుంబం. టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం అల్లు శిరీష్ రిసెప్షన్ కి కూడా విచ్చేశారు. కానీ, చిరు మాత్రం అటెండ్ కాలేదు. ఆయన భుజానికి సర్జరీ జరగడంతో రెస్ట్ లో ఉన్నారని, అందుకే శిరీష్ రిసెప్షన్ కి రాలేదని వార్తలు వచ్చాయి. అయితే రెండు రోజుల తరువాత జరిగిన విరోష్ రిసెప్షన్ లో చిరు కనిపించడం చర్చనీయాంశంగా మారింది. శిరీష్ రిసెప్షన్ కి చిరు మిస్ అవ్వడంతో విరోష్ రిసెప్షన్ లో ఆయనే ట్రెండింగ్ గా మారారు. మరి అక్కడ మిస్ అవ్వడం వెనుక కానీ, ఇక్కడ ట్రెండ్ అవ్వడం వెనుక కానీ ఏదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది.