Chiranjeevi: వినాయక చవితి వేళ చిరు, నాని ప్రత్యేక శుభాకాంక్షలు.. ఏమన్నారంటే!

ABN , Publish Date - Sep 14 , 2026 | 05:50 PM

మెగాస్టార్‌ చిరంజీవి వినాయక చవితి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు, అభిమానులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

మెగాస్టార్‌ చిరంజీవి వినాయక చవితి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు, అభిమానులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఓ సందేశాన్ని పంచుకున్నారు. విఘ్నాలను తొలగించి విజయాలను అందించే విఘ్నేశ్వరుడిని ప్రార్థిస్తూ.. ప్రతి ఇంటా సుఖసంతోషాలు, శాంతి, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని చిరంజీవి ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ తలపెట్టే మంచి పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవ్వాలని గణనాథుడిని వేడుకుంటున్నట్లు తెలిపారు. 

నేచురల్‌ స్టార్‌ నాని కూడా వినాయక చవితి సందర్భంగా అభిమానులకు, ప్రేక్షకులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. సోషల్‌ మీడియా వేదికగా ఆయన పంచుకున్న ఫోటో ఒకటి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నాని భుజాలపై వినాయకుడి ప్రతిమను ఎత్తుకున్నట్లు ఫాన్స్ చేసిన పోస్టర్ ను అయ్యన షేర్ చేసి ‘ఇది ఎవరు తయారు చేశారో తెలియదు.. కానీ వారికి ధన్యవాదాలు. అందరికీ హ్యాపీ వినాయక చవితి’’ అంటూ నాని పేర్కొన్నారు. ‘‘ఆ బుజ్జి విఘ్నేశ్వరుడి ఆశీస్సులు మీకు, మీ కుటుంబం మొత్తానికి ఉండాలి’’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు.  

Updated Date - Sep 14 , 2026 | 06:16 PM