చేతబడి: షూటింగ్ మొదలు కాలేదు.. అప్పుడే క్రేజ్..
ABN , Publish Date - Apr 17 , 2026 | 04:53 PM
జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘చేతబడి'. ఎం3 మీడియా, మహా మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
జేడీ చక్రవర్తి (JD Chakravarthy) ప్రధాన పాత్రలో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘చేతబడి' (Chetabadi). ఎం3 మీడియా, మహా మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మహర్షి కూండ్ల సమర్పణలో సూర్యాస్ రచన, దర్శకత్వం వహిస్తుండగా, మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా బాణామతి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రం హారర్, మిస్టరీ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేలా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.
ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్‌తో సినిమాపై ఆసక్తి పెరిగింది. గురువారం వెర్సటైల్ యాక్టర్ జేడీ చక్రవర్తి పుట్టినరోజు సందర్భంగా ఇందులో ఆయన పోషిస్తున్న పాత్ర కు సంబంధించిన లుక్ రివీల్ చేశారు మేకర్స్. మునుపెన్నడూ పోషించని డిఫరెంట్ అవతార్‌లో హీరోగా, విలన్‌గా జేడీ చక్రవర్తి కనిపించనున్నారని చిత్ర యూనిట్ తెలిపింది. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈలోపే ఐదు భాషల ఆడియో రైట్స్‌ను సరిగమ సంస్థ సొంతం చేసుకుంది. ఒక పాటను ఐదు భాషల్లో విడుదల చేయడం కామన్‌గా జరుగుతుంది. కానీ ఇందులో తెలుగులో ఒక పాట, మిగిలిన భాషల్లో డిఫరెంట్ సాంగ్స్, సేమ్ విజువల్‌తో రావడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని నీరంతా చెప్పారు. వచ్చే నెలనుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.