Bandla Ganesh Vs C Kalyan: బండ్ల గణేశ్‌కు సవాల్.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నామినేషన్ల ప్రక్రియ పూర్తి
ABN , Publish Date - Aug 26 , 2026 | 11:47 AM
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (Telugu Film Producers Council)ఎన్నికలకుగానూ నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది.
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (Telugu Film Producers Council)ఎన్నికలకుగానూ నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. సెప్టెంబర్ 6న ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్షుడి పదవికి ప్రముఖ నిర్మాతలు బండ్ల గణేష్ (Bandla Ganesh), సి. కల్యాణ్ (C.Kalyan) పోటీ పడుతున్నారు. అధ్యక్షుడితో పాటు ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి, జాయింట్ సెక్రటరీ పోస్టులకు కూడా ఎన్నికలు జరగనున్నాయి.
ఐదు పోస్టులకుగానూ 16 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఉపసంహరణకు ఈ నెల 28వరకు గడువుంది. గెలిచిన వారు 2028వరకు పదవుల్లో కొనసాగుతారు. వివిధ పోస్టులకు ప్రముఖ నిర్మాత అశోక్ కుమార్ వేసిన నామినేషన్లను తిరస్కరించారు. నామినేషన్‌లో ఉన్న క్లాజ్ నెంబర్ 6 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు.