SAKHIYAA: ఇదెక్కడి ట్రైలర్‌రా.. ఇన్ని ముద్దులా! అర్జున్ రెడ్డి.. బాబులా ఉంది
ABN , Publish Date - Feb 08 , 2026 | 09:46 PM
చైతన్య తమ్మిన, ఉర్మిమాల జంటగా రూపొందిన ఇండిపెండెంట్ చిత్రం సఖియా.
చైతన్య తమ్మిన (chaitanya thammina), ఉర్మిమాల (Urmimala) జంటగా రూపొందిన ఇండిపెండెంట్ చిత్రం సఖియా (SAKHIYAA). పీజే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రవీణ్ జల్లు (Praveen Jollu) ఈ సినిమాను నిర్మించారు.శ్రీనివాస్ తెల్లి (Srinivas Telli) రచన, దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పుడు డైరెక్ట్ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.
ఇప్పటికే గత నెలలో విడుదల చేసిన టీజర్ సినిమాపై హైప్ క్రియేట్ చేయగా తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ జానర్‌లో ఈ మూవీని తెరకెక్కించారు. హీరో హీరోయిన్ల నుంచి టెక్నీషియన్ల వరకు అంతా కొత్త వారు కలిసి ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ఇట్టే అర్థమవుతోంది.
తాజాగా.. విడుదల చేసిన ట్రైలర్‌ను గమనిస్తే కాలేజీలో అబ్బాయి, అమ్మాయి ప్రేమలో పడడం, ఆపై అర్జున్ రెడ్డి తరహాలో అన్ని కార్యాలు అయ్యాక అబ్బాయి గురించి బ్యాడ్ విషయాలు తెలియడం, దాంతో హీరోయిన్ దూరం అవడం, హీరో విరహ వేదనలో ఉండి అమ్మాయిలతో రఫ్‌గా వ్యవహరించడం వంటి సీన్లతో ఎమోషనల్‌గా ట్రైలర్ కట్ చేశారు. అంతేగాక అంతకుమించి అనే రేంజ్‌లో లెక్కకు మించి ముద్దు సన్నివేశాలతో ఔరా అనిపించారు.
ఇండిపెండెంట్ ఫిలిం అన్నారు కదా అని మోతాదుకు మించి ఘాటైన చుంబన సన్నివేశాలతో నింపేశారు. ట్రైలర్‌ను చూస్తే యూత్ ఆడియన్స్‌ను గట్టిగానే టార్గెట్ చేసినట్లు స్పష్టం అవుతోంది. ఇదిలాఉంటే.. ట్రైలర్ విడుదల అనంతరం ఈ చిత్రం ఏదైనా ఓటీటీ, డిజిటల్ స్ట్రీమింగ్‌కు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆసక్తి ఉన్నవారు సంప్రదించాలని కోరారు.