Shiva Kandukuri: సెన్సిబుల్ లవ్ స్టోరీగా 'చాయ్ వాలా'

ABN , Publish Date - Jan 19 , 2026 | 11:53 AM

శివ కందుకూరి, తేజు అశ్వినీ జంటగా నటించిన సినిమా 'చాయ్ వాలా'. ఈ మూవీ ఫిబ్రవరి 6న విడుదల కాబోతోంది.

Chai wala Movie

ప్రామిసింగ్ హీరో శివ కందుకూరి (Shiva Kandukuri) నటిస్తున్న సినిమా 'చాయ్ వాలా' (Chaiwala). ఈ సినిమాతో తమిళ సినిమా రంగానికి చెందిన తేజు అశ్వినీ (Teju Ashwini) తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతోంది. ప్రమోద్ హర్ష రచన అందించి, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రాధా విజయలక్ష్మి, వెంకట్ ఆర్ పాపుడిప్పు నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని తొలి కాపీ సిద్ధమైన ఈ సినిమాను ఫిబ్రవరి 6న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు.


'చాయ్ వాలా' సినిమా నుండి ఫస్ట్ సింగిల్ 'సఖిరే...' ఇప్పటికే విడుదలైంది. ప్రశాంత్ ఆర్ విహారి (Prasanth R Vihari) ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. కపిల్ కపిలన్ ఈ పాట పాడారు. క్రాంతి వర్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్న 'చాయ్ వాలా' సినిమాకు పవన్ నర్వ ఎడిటర్. ఈ సినిమాలో రాజీవ్ కనకాల (Rajeev Kanakala), మణిచందన, రాజ్ కుమార్ కసిరెడ్డి, జెమినీ సురేశ్‌ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. బాధ్యత లేకుండా పెరిగిన ఓ కొడుకు తండ్రి నడుపుతున్న కేఫ్ ను నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అతని జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయన్నదే ఈ సినిమా కథ అని టీజర్ చూస్తే అర్థమౌతోంది.

ఇప్పటికే ఫిబ్రవరి 6న పలు చిత్రాలు విడుదలకు సిద్థమయ్యాయి. అందులో గుణశేఖర్ తెరకెక్కించిన 'యుఫోరియా', అమర్ దీప్ చౌదరి 'సుమతీ శతకం', నవీన్ చంద్ర 'హనీ', మురళీ కృష్ణంరాజు నటిస్తున్న 'స్కై' సినిమాలు ఉన్నాయి. మరి ఈ సినిమాలలో ఏవేవి ప్రేక్షకాదరణ పొందుతాయో చూడాలి.

Updated Date - Jan 19 , 2026 | 11:54 AM