ఆకట్టుకుంటున్న ‘చాటు..చాటు’

ABN , Publish Date - Feb 16 , 2026 | 07:40 AM

పవన్‌ కళ్యాణ్ బత్తుల, వైష్ణ‌వి హీరో, హీరోయిన్లుగా పరిచయమవుతున్న ‘పురుషః’ చిత్రం నుంచి ‘చాటు చాటు..’ అంటూ సాగే గీతాన్ని మేకర్స్‌ రిలీజ్‌ చేశారు.

Purushaha

పవన్‌ కళ్యాణ్ బత్తుల (Pavan Kalyan B) హీరో, వైష్ణ‌వి హీరోయిన్‌గా పరిచయమవుతున్న చిత్రం ‘పురుషః’ (Purushaha). వీరు పులవల (Veeru Vulavala) దర్శకత్వం వహిస్తున్నారు. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వర రావు నిర్మిస్తున్నారు. వెన్నెల కిశోర్‌, రాజీవ్ క‌న‌కాల‌, స‌ప్త‌గిరి, క‌సిరెడ్డి రాజ్ కుమార్‌, విషిక‌, హాసిని సుధీక్, వీటీవీ గ‌ణేశ్‌ కీల‌క పాత్ర‌లు చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌ల చేసిన టీజ‌ర్‌, పాట‌లు సినిమాపై మంచి హైప్ తీసుకు వ‌చ్చాయి. ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు ఏర్ప‌రిచాయి.

ఈ క్ర‌మంలో తాజాగా ఈ చిత్రం నుంచి ‘చాటు చాటు..’ (Chaatu Chaatu) అంటూ సాగే గీతాన్ని మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. అనంత శ్రీరామ్ (Anantha Sriram) రాసిన ఈ పాటను చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada) ఆలపించారు. శ్రవణ్‌ భరద్వాజ్ (Shravan Bharadwaj) స్వరాలు సమకూర్చారు. మెలోడీ ట్యూన్‌తో సాగిపోతున్న ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన నిర్మాణాంతర పనులు శరవేగంగా సాగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది.

Updated Date - Feb 16 , 2026 | 11:01 AM