యుద్ధాలు చేయక్కర్లేదు.. గౌరవించండి చాలు

ABN , Publish Date - Mar 08 , 2026 | 12:09 PM

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులు మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు: ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భానుప్రకాష్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులు మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు.  ప్రతి ఒక్కరూ  మహిళలను  గౌరవించాలంటూ పిలుపునిచ్చారు.  ఈ సందర్భంగా  ఏబీఎన్- ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భానుప్రకాష్  ఎక్స్(ట్విట్టర్) వేదికగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 'అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇరాన్‌లోని పాఠశాలపై జరిగిన ఎయిర్ స్ట్రైక్‌లో ప్రాణాలు కోల్పోయిన 160 బాలికలను గుర్తు చేసుకుంటూ సంతాపంతో రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం' అని ఆయన పోస్ట్ లో పేర్కొన్నారు.

మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. 'నా జీవితంలో తల్లి నుంచి నా జీవిత భాగస్వామి వరకు, నా కుమార్తెలు నుంచి నా కోడళ్ల వరకు, ప్రతి రూపంలో నాకు స్ఫూర్తినిచ్చిన మహిళలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రపంచాన్ని ప్రేమతో, ధైర్యంతో ముందుకు నడిపిస్తున్న ప్రతి మహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు' అని పేర్కొన్నారు.

స్టార్ హీరో తారక్ కూడా స్త్రీలకు  శుభాకాంక్షలు చెప్పారు. 'మహిళల పట్ల గౌరవప్రదంగా వ్యవహరించేలా  నా కుమారులు ఇద్దరిని పెంచుతాను' అని ఆయన బెంగళూరులో పాల్గొన్న ఓ కార్యక్రమంలో తెలిపారు 

Updated Date - Mar 08 , 2026 | 03:49 PM