Mega Fans: మెగా ఫాన్స్.. 'కోలాహలమే కాదు.. బాధ్యత కూడా ఉండాలని నిరూపించారు'

ABN , Publish Date - Jan 12 , 2026 | 01:54 PM

టాలీవుడ్‌ (Tollywood Fans) ప్రేక్షకులకు సినిమాలంటే ఎంతో పిచ్చో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక అభిమాన హీరో సినిమా రిలీజ్‌ అంటే అదో పెద్ద పండగే! థియేటర్లు అందంగా అలంకరించబడతాయి..


టాలీవుడ్‌ (Tollywood Fans) ప్రేక్షకులకు సినిమాలంటే ఎంతో పిచ్చో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక అభిమాన హీరో సినిమా రిలీజ్‌ అంటే అదో పెద్ద పండగే! థియేటర్లు అందంగా అలంకరించబడతాయి.. భారీ కటౌట్‌లు, పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, తీన్‌మార్‌ సౌండ్‌లతో థియేటర్ల దగ్గర నానా రచ్చ చేస్తుంటారు. ఇక థియేటర్‌ లోపల అయితే ఈలలు, అరుపులు, పేపర్‌ ముక్కలతో  మొత్తం సందడిగా మారిపోతుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఉత్సాహం హద్దులు దాటి థియేటర్లతో ఇతరులు, సిబ్బంది పడటం చూస్తుంటాం. దేశంలోనే కాకుండా ఈ మధ్య ఇలాంటి వాటి వల్ల ఇబ్బంది పడ్డ సందర్భాలెన్నో(mega Fans).

అయితే మెగా అభిమానులు  ఏం చేసినా బాధ్యతగా వ్యవహరిస్తూ ఆదర్శంగా నిలుస్తారు.  వారి సెలబ్రేషన్స్‌లో సివిక్‌ సెన్స్‌కు (mega Fasns Civic Sense)ఎంత ప్రాధాన్యం ఇస్తారో మరోసారి నిరూపించారు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) నటించిన ‘మన శంకర వర ప్రసాద్‌ గారు’ (Mana Shankar Vara Prasad Garu). ప్రపంచవ్యాప్తంగా  12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 11వ తేది రాత్రి ప్రీమియర్‌ షోలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా అమెరికాలోని ఓ థియేటర్‌లో మెగాఫ్యాన్స్‌ చేసిన పని ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటుంది.

షో సమయంలో ఉత్సాహంగా సంబరాలు చేసిన అభిమానులు సినిమా పూర్తయ్యాక థియేటర్‌లో పడేసిన పేపర్లు, కన్‌ఫెట్టి, ఇతర చెత్తను తామే స్వయంగా శుభ్రం చేశారు.  షో అనంతరం ఫ్యాన్స్‌  థియేటర్‌  క్లీనింగ్‌ పనుల్లో పాల్గొని, థియేటర్‌ను పూర్తిగా శుభ్రం చేసి మేనేజ్‌మెంట్‌కు అప్పగించారు.  సంబరాలు ఎంత గొప్పగా జరిపినా, బాధ్యతను మరవకూడదనే సందేశాన్ని మెగా ఫ్యాన్స్‌ తమ చర్యతో బలంగా చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫొటోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. ‘ఇదే అసలైన ఫ్యాన్‌డమ్‌, సెలబ్రేషన్‌తోపాటు బాధ్యత కూడా అవసరం. అవి మెగా అభిమానులకే సాధ్యం’ అంటూ సోషల్‌ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రీమియర్‌ షోల నుంచి పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది.  నయనతార కథానాయికగా నటించిన ఈచిత్రంలో వెంకటేశ్‌ కీలక పాత్ర పోషించారు. 

Updated Date - Jan 12 , 2026 | 02:51 PM