త్రివిక్రమ్ వేస్తున్న భారీ వ్యూహం.. దానికోసమే
ABN , Publish Date - Jun 29 , 2026 | 09:25 PM
ప్రస్తుతం టాలీవుడ్ అంటే కేవలం రీజనల్ సినిమా కాదు.. ఇండియన్ బాక్సాఫీస్‌ను శాసించే ఒక పవర్‌హౌస్. ఈ సామ్రాజ్యాన్ని గ్లోబల్ లెవెల్‌కు తీసుకెళ్లిన ముగ్గురు దిగ్గజ దర్శకులలో ఎస్.ఎస్. రాజమౌళి (Rajamouli), సుకుమార్ (Sukumar), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) పేర్లు ముందు వరుసలో ఉంటాయి.
ప్రస్తుతం టాలీవుడ్ అంటే కేవలం రీజనల్ సినిమా కాదు.. ఇండియన్ బాక్సాఫీస్‌ను శాసించే ఒక పవర్‌హౌస్. ఈ సామ్రాజ్యాన్ని గ్లోబల్ లెవెల్‌కు తీసుకెళ్లిన ముగ్గురు దిగ్గజ దర్శకులలో ఎస్.ఎస్. రాజమౌళి (Rajamouli), సుకుమార్ (Sukumar), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) పేర్లు ముందు వరుసలో ఉంటాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో జక్కన్న తెలుగు సినిమా జెండాను ఆస్కార్ వరకు తీసుకెళ్తే.. పుష్ప ఫ్రాంచైజీతో సుకుమార్ నార్త్ బెల్ట్‌ను ఊపేశారు. కానీ, లోకల్ బాక్సాఫీస్ వద్ద వరుస బ్లాక్‌బస్టర్లతో ఇండస్ట్రీని ఏలుతున్న మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాత్రం, పాన్-ఇండియా రేసులో ఎందుకో ఇంకా కాస్త వెనుకబడే ఉన్నారు. జాతీయ స్థాయిలో ఆయన కలానికి ఉన్న పవర్ చూపించే ఒక్క సాలిడ్ హిట్ కోసం ఫ్యాన్స్ ఇన్నాళ్లుగా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
నిజానికి త్రివిక్రమ్‌ను గురూజీ అని ఎందుకు పిలుస్తారో అందరికీ తెలుసు. ఆయన రాసే డైలాగ్స్‌లో తెలుగుదనం, సంస్కృతి, క్లాస్ హ్యూమర్, గుండెల్ని పిండేసే ఎమోషన్స్ ఉంటాయి. అయితే, చిత్రంగా ఇదే ప్లస్ పాయింట్ ఆయన పాన్-ఇండియా మార్కెట్‌కు పెద్ద మైనస్‌గా మారింది. ఎందుకంటే, ఆ తెలుగు మాటల్లోని ప్రాసను, మాయను వేరే భాషల్లోకి అనువదించి.. అక్కడి ఆడియన్స్‌కు కూడా అదే ఫీల్ ఇవ్వడం కత్తిమీద సామే. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే, త్రివిక్రమ్ కేవలం తెలుగు వారికే పరిమితం అవుతున్నారా? రాజమౌళి, సుకుమార్ రేంజ్ గ్లోబల్ గుర్తింపు ఆయనకు దక్కదా? అనే చర్చ టాలీవుడ్ సర్కిల్స్‌లో ఎప్పటి నుంచో హాట్ టాపిక్‌గా నడుస్తోంది.
కానీ ఇప్పుడు సీన్ మారబోతోంది. పాన్ ఇండియా రేంజ్ కోసం త్రివిక్రమ్ వేసిన భారీ వ్యూహమే గాడ్ ఆఫ్ వార్. తన కంఫర్ట్ జోన్ అయిన ఫ్యామిలీ డ్రామాలను పక్కనబెట్టి ఈ భారీ పౌరాణిక చిత్రంతో సరికొత్త ప్రయోగానికి తెరలేపుతున్నారు. భారీ యాక్షన్ ఎపిసోడ్స్, హై-ఎండ్ విజువల్స్ ఉన్న ఈ సినిమా ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మైలురాయి కానుంది. అంతేకాకుండా నటర్ ఆల్రెడీ పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరో.. ఈ సినిమాతో త్రివిక్రమ్ కూడా పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగినట్టే. దీనికి తోడు, సూపర్ స్టార్ మహేష్ బాబు గ్లోబల్ ప్రాజెక్ట్ వారణాసి తర్వాత, త్రివిక్రమ్ తో సినిమా రాబోతుందనే క్రేజీ టాక్ నడుస్తోంది. ఆ సినిమా రిలీజ్ అయ్యేసరికి గురూజీ కూడా ఈ సినిమాను రిలీజ్ చేసి పాన్ ఇండియా డైరెక్టర్ అనిపించుకుంటే.. మహేష్ ఇమేజ్ ఒకపక్క.. గురూజీ ఇమేజ్ ఇంకోపక్క కలిపి.. ఆ సినిమా హైప్ ఆకాశాన్ని తాకుతుంది. మరి గురూజీ.. గాడ్ ఆఫ్ వార్ తో పాన్ ఇండియా డైరెక్టర్ అని అనిపించుకుంటారా.. ? లేదా అనేది చూడాలి.