బుచ్చిబాబు వదిలిన ‘జయహో జనార్ధన’ ఫస్ట్ సాంగ్

ABN , Publish Date - Aug 23 , 2026 | 01:44 PM

ఉప్పెన, పెద్ది చిత్రాల దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ‘జయహో జనార్ధన’ సినిమా ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదలైంది.

ఉప్పెన, పెద్ది చిత్రాల దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ‘జయహో జనార్ధన’ సినిమా ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదలైంది. ‘చిందువేయవే చాందుక తుకడ’ అంటూ సాగే ఈ హై ఎనర్జిటిక్ పాటను శనివారం విడుదల చేశారు. జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించారు. జంగి రెడ్డి, మోహనా భోగరాజు ఆలపించిన ఈ పాటకు చరణ్ అర్జున్ సంగీతం అందించారు. పానుగంటి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పానుగంటి శరత్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నరేష్ వాసం, రమ్యశ్రీ హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా 30 ఇయర్స్ పృథ్వీ, చలాకి చంటి, రాఘవ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. లవ్, కమర్షియల్, కామెడీ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి త్వరలో టీజర్, ట్రైలర్ విడుదల చేయనున్నట్లు నిర్మాత, దర్శకుడు తెలిపారు.

Updated Date - Aug 23 , 2026 | 01:45 PM