బన్నీ ఫుల్‌ బిజీ.. బోయపాటికి వర్కవుట్‌ అవుతుందా..

ABN , Publish Date - Feb 10 , 2026 | 01:18 PM

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ‘అఖండ-2’ చిత్రం విడుదలై రెండు నెలలు కావొస్తుంది. కానీ బోయపాటి శ్రీను తదుపరి చిత్రంపై ఇప్పటి దాకా ఎలాంటి క్లారిటీ రాలేదు.

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ‘అఖండ-2’ చిత్రం విడుదలై రెండు నెలలు కావొస్తుంది. కానీ బోయపాటి శ్రీను తదుపరి చిత్రంపై ఇప్పటి దాకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఆయన సినిమా మొదలుపెట్టాలంటే స్టార్‌ హీరోలు కావాలి. ప్రస్తుతం అందుబాటులో ఏ స్టార్‌ హీరో లేరు. అందరూ షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. అఖండ2 తర్వాత బోయపాటి - అల్లు అర్జున్‌ కాంబినేషన్‌ రిపీట్‌ అవుతుందని టాక్‌ నడిచింది. బన్నీకి ఓ లైన్‌ చెప్పారట బోయపాటి. అది ఇంకా వర్కవుట్‌ కాలేదు. ఇప్పుడు బన్నీ కమిట్‌మెంట్స్‌ వేరు. తమిళ దర్శకుడు అట్లీతో ఓ భారీ చిత్రం చేస్తున్నారు. బోయపాటి మాత్రం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. 

ఇటీవల బోయపాటి శ్రీను రణ్‌వీర్‌సింగ్‌ను కలవడానికి ముంబై వెళ్లారని టాక్‌ నడిచింది. అయితే ఆయన ముంబై వెళ్లింది అట్లీ సెట్‌లో ఉన్న అల్లు అర్జున్‌ కోసమట. తాజాగా బన్నీని కలిసి పూర్తి గెటప్‌తో సహా కథను వివరించి వచ్చారట. బోయపాటి చెప్పిన కథ బన్నీకి నచ్చిందని సమాచారం. అయితే ఇప్పట్లో ఆ ప్రాజెక్ట్‌కు పట్టాలెక్కే పరిస్థితి లేదు. ఎందుకంటే బన్నీ ఇటు అట్లీతో సినిమా చేస్తున్నారు. మరో పక్క లోకేశ్‌ కనకరాజ్‌తో ఓ సినిమా కమిట్‌ అయ్యారు. ఈ రెండు చిత్రాలు పూర్తవడానికి దాదాపు ఏడాదిన్నర సమయం పడుతుంది. అప్పటి దాకా బోయపాటి వెయిట్‌ చేయాల్సిందే. లేదంటే మరో అప్షన్‌ చూసుకోవలసిందే. అయితే రానా దగ్గుబాటి కోసం కూడా ఓ కథ రాస్తున్నారట బోయపాటి శ్రీను. ప్రస్తుతం ఈ దర్శకుడికి బెస్ట్‌ ఆప్షన్‌ రానా. అంతా అనుకున్నట్లే జరిగితే ఈ కాంబినేషన్‌లో సినిమా మొదలయ్యే అవకాశం ఉంది. 

Updated Date - Feb 10 , 2026 | 01:26 PM