Boyapati Srinu: మాస్ డైరెక్టర్ కొత్త రూట్.. నెక్స్ట్ స్టెప్ ఎటువైపు

ABN , Publish Date - Jan 03 , 2026 | 01:01 PM

టాలీవుడ్ వెండితెరపై మాస్ అనే పదానికి సరికొత్త అర్థం చెప్పిన దర్శకుల్లో బోయపాటి శ్రీను ఒకరు. హీరో నడకలో గాంభీర్యం, ఫైట్స్‌లో వయొలెన్స్, ఎమోషన్స్‌లో డెప్త్.. ఇలా అన్ని అంశాలను మేళవించి సినిమాను ఒక జాతరలా మార్చడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.

టాలీవుడ్ (Tollywood) వెండితెరపై మాస్ అనే పదానికి సరికొత్త అర్థం చెప్పిన దర్శకుల్లో బోయపాటి శ్రీను ఒకరు. హీరో నడకలో గాంభీర్యం, ఫైట్స్‌లో వయొలెన్స్, ఎమోషన్స్‌లో డెప్త్.. ఇలా అన్ని అంశాలను మేళవించి సినిమాను ఒక జాతరలా మార్చడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. 'భద్ర' సినిమాతో మొదలైన ఆయన విజయ ప్రస్థానం.. 'సింహా', 'లెజెండ్' వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తిరుగులేని మాస్ డైరెక్టర్‌గా మార్చేసింది. ఇక నందమూరి బాలకృష్ణతో కలిసి చేసిన 'అఖండ' బాక్సాఫీస్ వద్ద సృష్టించిన శివతాండవం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇటీవల వీరిద్దరి కాంబినేషన్‌లోనే 'అఖండ 2 తాండవం' (Akhanda 2) పాన్ ఇండియా స్థాయిలో విడుదలైనప్పటికీ అనుకున్న విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే, ఈ భారీ ప్రాజెక్ట్ తర్వాత బోయపాటి నెక్స్ట్ అడుగు ఎటువైపు? ఆయన తర్వాతి సినిమా ఎవరితో ఉండబోతోంది? అనే ప్రశ్నలు ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. (Boyapati srinu Bollywood)

అయితే బోయపాటి శ్రీను ఇప్పుడు తన ఫోకస్‌ను బాలీవుడ్ వైపు మళ్లించినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ మాస్ దర్శకుల్లో ఒకరైన బోయపాటి, ఇప్పుడు నేరుగా హిందీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. నిజానికి హిందీ ప్రేక్షకులకు బోయపాటి మార్క్ మేకింగ్ కొత్తేమీ కాదు. ఆయన దర్శకత్వం వహించిన 'సరైనోడు', 'జయ జానకి నాయక','అఖండ' వంటి చిత్రాల హిందీ డబ్బింగ్ వెర్షన్లు యూట్యూబ్‌లో వందల మిలియన్ల వ్యూస్ సాధించాయి. అక్కడ ఈ సినిమాలకు ఉన్న క్రేజ్ చూస్తుంటే, ఆయన డైరెక్ట్ హిందీ సినిమా చేస్తే ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. బోయపాటి మార్క్ ఊర మాస్ యాక్షన్‌ను తట్టుకోగల బాలీవుడ్ హీరో ఎవరు?. ఆయనను అక్కడ లాంచ్ చేసే భారీ నిర్మాత ఎవరు? అనే విషయాలు ఇంకా బయటకు రాలేదు. సల్మాన్ ఖాన్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోతో సినిమా ఉంటుందా లేక యువ హీరోలెవరైనా ఈ రేసులో ఉన్నారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. బాలీవుడ్ జనం కూడా బోయపాటి మార్క్ యాక్షన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే మాత్రం, బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బోయపాటి బ్రాండ్ యాక్షన్ జాతర ఖాయమని చెప్పొచ్చు. ఈ క్రేజీ ఎంట్రీపై అధికారిక ప్రకటన వస్తే తప్ప మరిన్ని వివరాలు తెలిసే అవకాశం లేదు.

Updated Date - Jan 03 , 2026 | 01:12 PM