అనుపమా పరమేశ్వరన్... క్రేజీ బర్త్ డే పోస్టర్...
ABN , Publish Date - Feb 18 , 2026 | 12:57 PM
ప్రతిభావంతురాలైన నటి అనుపమా పరమేశ్వరన్ ప్రస్తుతం తెలుగులో 'క్రేజీ కళ్యాణం' మూవీలో నటిస్తోంది. బుధవారం ఆమె పుట్టిన రోజును పురస్కరించుకుని మేకర్స్ బర్త్ డే విషెస్ తెలియచేస్తూ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
సీనియర్ నటుడు నరేశ్ వీకే (Naresh VK), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), తరుణ్ భాస్కర్ (Tharun Bhasckar), 'రాజ్ వెడ్స్ రాంబాయి' ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'క్రేజీ కళ్యాణం' (Crazy Kalyanam). ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై బూసమ్ జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఆయనకు నిర్మాతగా ఇది రెండో సినిమా. 'క్రేజీ కళ్యాణం'కు బద్రప్ప గాజుల దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 18 బ్యూటిఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ బర్త్ డే సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ 'క్రేజీ కల్యాణం' మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
'క్రేజీ కళ్యాణం' మూవీ పోస్టర్ లో పెళ్లి కూతురి దుస్తుల్లో సంతోషంగా డ్యాన్స్ చేస్తున్న అనుపమా పరమేశ్వరన్ స్టిల్ ఆకట్టుకుంటోంది. ఆమె ఈ చిత్రంలో కీర్తి అనే క్యారెక్టర్‌లో ప్రేక్షకులను అలరించనుంది. 'పెళ్లి చుట్టూ సాగే ఆసక్తికరమైన కథతో కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్‌తో సాగే చిత్రమిదని, తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరిపామని మేకర్స్ తెలిపారు. సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.