శర్వానంద్ : తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే సినిమా

ABN , Publish Date - Apr 04 , 2026 | 11:25 AM

నా ప్రతి సినిమాకు ప్రభాస్ అన్న ఏదో  ఒక రూపంలో సాయం చేస్తుంటారు. ఈ సినిమా ట్రైలర్ గురించి ట్వీట్ చేశారు.

'నా ప్రతి సినిమాకు ప్రభాస్ అన్న ఏదో  ఒక రూపంలో సాయం చేస్తుంటారు. ఈ సినిమా ట్రైలర్ గురించి ట్వీట్ చేశారు. సినిమా రిలీజ్‌కు ముందు ఒక చిన్న యాడ్ చేసి సపోర్ట్ ఇచ్చారు. లవ్ యూ ప్రభాస్ అన్న. నా మనసులో ఆయన ఎప్పుడూ గొప్ప స్థానంలో ఉంటారు' అని  శర్వానంద్ అన్నారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్, మాళవిక నాయర్ జంటగా నటించిన చిత్రం 'బైకర్'. రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. UV క్రియేషన్స్ నిర్మాణంలో భారతదేశపు మొట్టమొదటి కంప్లీట్ మోటో క్రాస్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసలు అందుకుంటోంది. ఈ సందర్భంగా మేకర్స్ బంపర్ బ్లాక్ బస్టర్ మీట్ ని నిర్వహించారు.


శర్వా మాట్లాడుతూ 'యూవీ క్రియేషన్స్‌లో ఇది నాకు నాలుగో హిట్. రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా, మహానుభావుడు, ఇప్పుడు బైకర్. సంక్రాంతికి బ్లాక్‌బస్టర్ ఇస్తానని చెప్పాను.. ఇచ్చాను. ఇప్పుడు సమ్మర్‌కు బంపర్ బ్లాక్‌బస్టర్ ఇచ్చాం. ఇలాంటి సినిమాలు చేయాలంటే ప్రొడ్యూసర్‌కు అభిరుచి ఉండాలి. ఈ సినిమాను అద్భుతంగా నిర్మించిన వంశీకి థాంక్స్. అభిలాష్ రెడ్డి చెప్పిన కథ నన్ను చాలా ఇన్‌స్పైర్ చేసింది. నేను ఇలా ట్రాన్స్‌ఫర్మేషన్ అవ్వడానికి, వెయిట్ తగ్గడానికి కారణం నన్ను ఇన్‌స్పైర్ చేసిన కథ. ఈ క్యారెక్టర్ కోసం దాదాపు 22 కిలోలు తగ్గాను. బైకర్ తో నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. ఇండియా గర్వించే సినిమా తీస్తామని చెప్పాం..తీసాం. ఇప్పుడు ఆడియన్స్‌కు చూపిస్తున్నాం. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే సినిమా ఇది.  నా కెరీర్ కు  బెస్ట్ ఫిల్మ్ అని నేను గర్వంగా చెప్పుకుంటాను. రేసింగ్ సీక్వెన్స్‌లు అద్భుతంగా రావడానికి కారణం యాక్షన్ మాస్టర్ దిలీప్. అలాంటి సీన్స్ చేయాలంటే విజన్, అనుభవం చాలా అవసరం. మా డీవోపీ యువరాజ్, మధి  అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. రాజశేఖర్ గారి దగ్గర నుంచి హంబుల్‌నెస్ నేర్చుకోవాలి. ఆయనంత సింపుల్, ప్యూర్ హార్టెడ్ వ్యక్తిని నేను చూడలేదు. స్క్రీన్ మీద నిజంగా తండ్రి-కొడుకుల్లా అనిపించింది. ఇందులో స్పోర్ట్స్ డ్రామాతో పాటు తండ్రి-కొడుకుల ఎమోషన్ ఉంది. పిల్లలతో కలిసి ఈ సినిమా చూడండి. 

Biker

రాజశేఖర్ మాట్లాడుతూ 'ఈ సినిమా  అద్భుతంగా రావడం, మంచి పేరు తెచ్చుకోవడానికి ఒక ముఖ్య కారణం డైరెక్టర్ అభిలాష్ రెడ్డి. సినిమాను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్ది ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఆయన విజన్‌కు తగ్గట్టు ఖర్చు పెట్టిన నిర్మాత వంశీ గారికి హ్యాట్సాఫ్. ఈ సినిమాలో రేసింగ్‌తో పాటు అందమైన ఫ్యామిలీ మూమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ టైమ్ స్క్రీన్ మీద నన్ను తాతయ్య అని పిలిపించే క్యారెక్టర్ చేశాను' అన్నారు. 

'ప్రీమియర్స్‌ చూసినప్పటి నుంచి బైక్ సౌండ్ ఇంకా చెవుల్లో మోగుతూనే ఉంది. అంత గొప్పగా ఈ సినిమాకు సౌండ్ మిక్సింగ్ చేశారు. ఆ సౌండ్ రీసౌండ్ రూపంలో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్‌గా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.  ఈ సినిమా కోసం శర్వా ప్రతిరోజూ దాదాపు 30 కిలోమీటర్లు నడవడం నేను ప్రత్యక్షంగా చూశాను. అంత డెడికేషన్‌తో ఈ సినిమా చేశారు. బైకర్" ఆయన కెరీర్‌లో ది బెస్ట్ అని చెప్పొచ్చు' అని సంపత్ నంది అన్నారు. 

'రెండేళ్ల కష్టమిది. మంచి సినిమా ఇవ్వాలని అహర్నిశలు శ్రమించాం. . రాజశేఖర్ గారితో వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.'బైకర్' లాంటి కథను అభిలాష్ లాంటి దర్శకుడు మాత్రమే తీయగలరు. . సినిమాకు వస్తున్న స్పందన  చూస్తే చాలా గౌరంగా  ఉంది. ఈ మూమెంట్ చాలా ఎమోషనల్‌గా ఉంది' అని మాళవిక నాయర్ అన్నారు. 

సినిమాలో ఎమోషన్, రేసింగ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. మొదటినుంచి ఈ సినిమాలో రేసింగ్‌తో పాటు ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుందని చెప్పాను. ఈరోజు ఆడియన్స్ అదే ఎమోషన్‌కు కనెక్ట్ అయ్యారు. క్లైమాక్స్ సీన్స్ గురించి అందరూ ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. చిన్న పిల్లలు కూడా రేసింగ్ సీన్స్ చూసి టెన్షన్ పడుతున్నారు అంటే, ఒక దర్శకుడిగా నేను అనుకున్నది సాధించానని భావిస్తున్నాను. చివరి 40 నిమిషాలు అద్భుతంగా వుందని ప్రశంసిస్తున్నారు. అదే మేము సెట్ చేసిన డ్రామా. శర్వా  నా విజన్‌ను నమ్మి ఈ అవకాశం ఇచ్చారు. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్‌లో రావడానికి ప్రధాన కారణం శర్వానంద్ గారే.  శర్వా, రాజశేఖర్ గారి కెమిస్ట్రీ అద్భుతంగా వచ్చింది. జిబ్రాన్ మ్యూజిక్ అసెట్ అయింది. ఇలాంటి సినిమాలు తీయాలంటే నిర్మాతలకు గట్స్ ఉండాలి.  నిర్మాతలు ప్రతి విషయంలో నాకు పూర్తి సపోర్ట్ ఇచ్చారు. రేపటి నుంచి మా సినిమా ఇంకా గట్టిగా మాట్లాడుతుంది' అని దర్శకుడు చెప్పారు. 

Updated Date - Apr 04 , 2026 | 11:26 AM