గ్రాండ్ గా మొదలైన బిగ్ బాస్ 10.. వచ్చిరాగనే రచ్చ చేసిన సీరియల్ బ్యూటీ
ABN , Publish Date - Sep 06 , 2026 | 08:06 PM
తెలుగు బుల్లితెరపై అత్యంత పాపులారిటీ సొంతం చేసుకున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటికే 9 సీజన్స్ సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసిన బిగ్ బాస్.. ఇప్పుడు 10 వ సీజన్ లోకి అడుగుపెట్టింది.
తెలుగు బుల్లితెరపై అత్యంత పాపులారిటీ సొంతం చేసుకున్న రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss). ఇప్పటికే 9 సీజన్స్ సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసిన బిగ్ బాస్.. ఇప్పుడు 10 వ సీజన్ లోకి అడుగుపెట్టింది. కింగ్ అక్కినేని నాగార్జున గ్రాండ్‌గా హోస్ట్ చేస్తున్న ఈ ల్యాండ్‌మార్క్ సీజన్ దశావతారాల కాన్సెప్ట్‌తో గ్రాండ్ లాంచ్ వేడుకతో అట్టహాసంగా మొదలైంది. ఈ క్రమంలో ఇప్పటివరకు నలుగురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. ప్రముఖ సీరియల్ నటి దేబ్‌జాని మోడక్, హీరో త్రిగుణ్, అగ్నిపరీక్ష టాస్క్‌లో పాస్ అయి నేరుగా హౌస్ ఎంట్రీ సాధించిన రైతు బిడ్డ, గాయని ఝాన్సీ బిగ్ బాస్ ప్రాంగణంలోకి సందడి చేస్తూ ఎంట్రీ ఇచ్చింది.
హౌస్‌లోకి అడుగుపెట్టిన మొదటి కంటెస్టెంట్లలో ఒకరైన దేబ్‌జాని మోడక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఈ సీరియల్ నటి తనకు వచ్చిరాని తెలుగులో హోస్ట్ నాగార్జునను చూసి మురిసిపోతూ, ఆయనపై ఉన్న అభిమానంతో పాట పాడటం లాంచ్ ఈవెంట్‌లో నవ్వులు పూయించింది. దేబ్‌జాని ముద్దుముద్దుగా మాట్లాడిన మాటలు, నాగార్జునకు డెడికేట్ చేసిన పాట ప్రేక్షకులను, నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. త్రిగుణ్ స్టైలిష్ ఎంట్రీ, ఝాన్సీ అగ్నిపరీక్ష దాటుకుని రావడం ఈ లాంచ్ ఎపిసోడ్‌కి మరింత హంగామాను తెచ్చిపెట్టాయి. ఇక నాలుగో కంటెస్టెంట్ గా ఇంటర్వ్యూ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ రెడ్డి ఇంట్లోకి అడుగుపెట్టాడు.
ఐదవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష నుంచి వచ్చిన కామనర్ అమన్ ఇంట్లో అడుగుపెట్టాడు. ఆడియెన్స్ పోల్ ద్వారా అమన్ ఎన్నికయ్యాడు. అంతేకాకుండా అమన్ కి నాగ్ ఒక టాస్క్ ఇచ్చాడు. ఇక బిగ్ బాస్ స్టేజిపై సర్దార్ 2 టీమ్ సందడి చేశారు. హీరో కార్తీ, ఎస్ జె సూర్య రచ్చ చేశారు.
ఇక ఆరవ కంటెస్టెంట్ గా మరో సీరియల్ నటి చైత్ర రాయ్ ఎంటర్ అయ్యింది. బెంగుళూరులో అనుకోకుండా ఒక డైరెక్టర్ తనను ఫోటో తీయడం వలన ఇండస్ట్రీలో అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చింది. 10 నెలల బేబీని వదిలి బిగ్ బాస్ కి వచ్చినట్లు ఆమె తెలిపింది.
ప్రతి సీజన్ లో జబర్దస్త్ నుంచి కచ్చితంగా ఒకరిద్దరు కంటెస్టెంట్స్ ఉండడం సాధారణంగా మారింది. ఇక ఈసారి ఎంటర్ టైన్మెంట్ కి ఏమాత్రం కొదువ లేకుండా ఏడవ కంటెస్టెంట్ గా జబర్దస్త్ నుంచి రాంప్రసాద్ అడుగుపెట్టాడు. చిరు సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన రాంప్రసాద్ ను నాగ్ ఆడేసుకున్నాడు. ఎంటర్ టైన్మెంట్ చేయని కారణంగా బయటకు పంపించేస్తనని చెప్పి హౌస్ లోపలికి పంపించాడు.
ఇక ఎనిమిదవ కంటెస్టెంట్ గా షాలిని బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది. అగ్నిపరీక్షకి జడ్జిగా వ్యవహరించిన నవదీప్.. షాలినిని హౌస్ లోకి పంపాలని కోరాడు. జ్యూరీ సభ్యులు ఎన్నిక చేసిన షాలినిని నాగ్ హౌస్ లోకి పంపాడు.
ఇక 9 వ కంటెస్టెంట్ గా నటుడు వంశీ హౌస్ లోకి ఎంటర్ అయ్యాడు. చిన్న చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ని మొదలుపెట్టిన వంశీ.. టెంపర్ సినిమాలో విలన్ గా నటించి టెంపర్ వంశీగా మారాడు. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నా కూడా వంశీ ఈ రియాలిటీ షోలో పాల్గొనడం విశేషం.
బిగ్ బాస్ సీజన్ 10 లో 10 వ కంటెస్టెంట్ గా శ్రీష్టి ఎంటర్ అయ్యింది. ఈమెను కూడా జ్యూరీ సభ్యులు సెలెక్ట్ చేశారు. అగ్ని పరీక్షలో తన సత్తా చాటిన ఆమె హౌస్ లో కూడా అదే సత్తా చూపిస్తాను అని చెప్పుకొచ్చింది.
ఇక 11 వ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఇచ్చాడు పొట్టి నరేష్. జబర్దస్త్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నరేష్.. బిగ్ బాస్ లో కూడా మంచి ఎంటర్ టైన్ చేస్తానని చెప్పి మరీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
తన చలాకీతనంతో అగ్ని పరీక్షలో అందరిని మెప్పించిన చరణ్ 12 వ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.