అషురెడ్డికి హైకోర్టులో షాక్‌.. కేసు కొట్టివేత పిటిషన్ తిరస్కరణ

ABN , Publish Date - May 08 , 2026 | 06:34 AM

బిగ్‌బాస్ ఫేమ్, నటి అషురెడ్డి (Ashu Reddy)కి హైకోర్టులో చుక్కెదురైంది.

Ashu Reddy

బిగ్‌బాస్ ఫేమ్, నటి అషురెడ్డి (Ashu Reddy)కి హైకోర్టులో చుక్కెదురైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఎన్నారై టికీ ధర్మేంద్ర (Dharmendra) నుంచి రూ.3.35 కోట్లు తీసుకుని మోసం చేశారన్న ఆరోపణలతో పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చింది.

అన్ని ఆధారాలతోనే కేసు నమోదు చేసి నట్లు పోలీసుల తరపు ప్రభుత్వ న్యాయవాది తెలిపిన నేపథ్యంలో కేసు దర్యాప్తును నిలిపేయడానికి జస్టిస్ జె.శ్రీనివాస్ రావు ధర్మాసనం నిరాకరించింది.

పోలీసులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్త ర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలంటూ పోలీసులు, ఫిర్యాదుదారుకు ఆదేశాలు జారీ చేస్తూ.. తదుపరి విచారణ వచ్చే నెల 9కు వాయిదా వేసింది.

Updated Date - May 08 , 2026 | 06:49 AM