తారక్ ఫ్యాన్స్‌కు.. కొరటాల షాక్! దే'వర'-2 ఉన్నట్లా.. లేనట్లా?
ABN , Publish Date - May 22 , 2026 | 12:52 PM
ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు జరిగిన కొన్ని ఘటనలు అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. దేవర టీమ్ నుంచి ఒక్క పోస్ట్ లేకపోవడం ఆసక్తికరంగా మారింది.
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ( Jr NTR) కెరీర్‌లో ఆర్ఆర్ఆర్ (RRR) ఎలాంటి సంచలనం సృష్టించిందో మనమంతా చూశాం. ఆ సినిమా తెచ్చిన క్రేజ్‌తో తారక్, రాజమౌళి, రామ్ చరణ్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఎవరి ప్రాజెక్టులతో వారు బిజీ అయిపోయారు. ముఖ్యంగా ఎన్టీఆర్ తన తదుపరి సినిమాలను చాలా పక్కా ప్లానింగ్‌తో లైన్‌లో పెట్టారు. అందులో భాగంగానే వచ్చిన దేవర పార్ట్-1 (Devara) బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామీ సృష్టించిందో చూశాం. సోలో హీరోగా తారక్ పవర్ ఏంటో నిరూపిస్తూ.. ఏకంగా 500 కోట్ల క్లబ్‌లో నిలిచి ట్రేడ్ వర్గాలకే షాక్ ఇచ్చింది ఈ సినిమా.
అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. థియేటర్లలో దేవరకు సాలిడ్ కలెక్షన్స్, టాక్ వచ్చినా.. ఓటీటీకి వచ్చేసరికి మాత్రం డిజిటల్ ఆడియన్స్ నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. కథలో కొన్ని లోపాలు ఉన్నాయంటూ కామెంట్స్ వినిపించాయి. దీంతో అలర్ట్ అయిన దర్శకుడు కొరటాల శివ (Koratala Siva).. దేవర 2 (Devara 2) విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. స్క్రిప్ట్‌ను మరింత పదును పెట్టే పనిలో పడ్డారు. కానీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అసలు ‘దేవర-2’ ఉంటుందా..? లేక పక్కన పెట్టేశారా..? అనే అనుమానాలు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.
అసలు ఈ అనుమానాలకు కారణం ఏంటి?.. దేవర టీమ్ ప్రవర్తనలో మారిన వ్యూహం ఏంటి..? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా లైన్‌లో ఉంది. డ్రాగన్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది జూన్ 11న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు కూడా చేస్తున్నారు. అయితే తారక్ ఇలా బిజీగా ఉండడంతో, కొరటాల శివ తన రూట్ మార్చినట్లు స్పష్టమవుతోంది. ఆయన ఖాళీగా ఉండకుండా నందమూరి బాలకృష్ణతో ఒక సినిమాకు లైన్ క్లియర్ చేసుకున్నారు. జులై నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఒకవేళ బాలయ్యతో సినిమా మొదలైతే.. అది పూర్తవడానికి కనీసం ఏడాది సమయం పడుతుంది. అటు ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్ సినిమాను పూర్తి చేయాలి. అంటే టెక్నికల్‌గా చూస్తే దేవర-2 పట్టాలెక్కడానికి చాలా సమయం పడుతుంది.
గతంలో ఎన్టీఆర్, కొరటాల శివ ఇద్దరూ దేవర-2 ఆలస్యం కావచ్చు కానీ.. పక్కాగా వస్తుందని క్లారిటీ ఇచ్చారు. కానీ, ఇటీవల ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు జరిగిన కొన్ని సంఘటనలు అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. తారక్ బర్త్‌డే సందర్భంగా డ్రాగన్ టీమ్ నుంచి స్పెషల్ సర్ప్రైజ్ వచ్చింది. నిర్మాత నాగవంశీ కూడా ఇన్ డైరెక్ట్‌గా త్వరలో గాడ్ ఆఫ్ వార్ సెట్స్‌లో కలుద్దాం అంటూ ట్వీట్ చేశారు. కానీ, మిగతా అందరూ విషెస్ చెప్తే.. దేవర టీమ్ నుంచి మాత్రం ఒక్క పోస్ట్ కూడా రాలేదు. కనీసం బర్త్‌డే కార్డ్ కూడా డిజైన్ చేయలేదు.
గతంలో హీరోయిన్ జాన్వీ కపూర్ పుట్టినరోజు వస్తేనే స్పెషల్ ట్వీట్ చేసిన దేవర టీమ్.. సినిమాకు ప్రాణమైన ఎన్టీఆర్ పుట్టినరోజును పూర్తిగా మర్చిపోవడం వెనుక అర్థం ఏంటి..? ఇదే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. హీరో పుట్టినరోజున కనీసం ఒక విష్ కూడా చేయకపోవడంతో.. ఇండస్ట్రీలో దేవర-2 ప్రాజెక్ట్ కష్టమేననే సిగ్నల్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. కొరటాల శివ బాలయ్య వైపు వెళ్లడం, దేవర టీమ్ సైలెంట్ అయిపోవడం చూస్తుంటే.. ఈ ప్రాజెక్ట్ తాత్కాలికంగా హోల్డ్‌లో పడిందా..? లేక పూర్తిగా డ్రాప్ అయ్యిందా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే.. కొరటాల శివ లేదా ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ అఫీషియల్‌గా స్పందించే వరకు వెయిట్ చేయాల్సిందే.