Peddi: స్పెషల్ సాంగ్ రిలీజ్ అక్కడే
ABN , Publish Date - May 19 , 2026 | 07:03 PM
రామ్ చరణ్ (Ram charan) హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది’ చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకురానుంది.
రామ్ చరణ్ (Ram charan) హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది’ చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రచారంలో భాగంగా ప్రముఖ నగరాల్లో స్పెషల్ ఈవెంట్‌ను నిర్వహించాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. సోమవారం ముంబయిలో ట్రైలర్ లాంచ్ చేశారు. మే 23న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఏఆర్ రెహమాన్‌తో లైవ్ కాన్సర్ట్‌ను నిర్వహించనున్నారు. భారీగా జరగనున్న ఈ ఈవెంట్ కోసం టీమ్ ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది. భోపాల్‌లోని బీహెచ్‌ఈఎల్ గ్రౌండ్స్‌లో పూజా కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ వేడుకలో స్పెషల్ సాంగ్ ను విడుదల చేయనున్నారు. సినిమాకు ఆ పాట స్పెషల్ అట్రాక్షన్ అని దర్శకుడు ఇటీవల తెలిపారు. ఆ పాట ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ బ్లాస్ట్ అని చెప్పారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సూపర్ హిట్‌గా నిలిచి యూట్యూబ్, సోషల్ మీడియాను షేక్ చేశాయి. జాన్వీకపూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలకపాత్రల్లో కనిపించనున్నారు.