Reality: నిజంగా ఇదే కదా బతకడమంటే.. ఏం లిరిక్స్ రా బాబు

ABN , Publish Date - Oct 19 , 2026 | 11:47 AM

టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) మొదటిసారిగా మెగాఫోన్ పట్టుకుంటూ, స్వయంగా దర్శకత్వం వహిస్తున్న మోస్ట్ అవేటెడ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా చిత్రం రియాలిటీ (Reality).

Reality

టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) మొదటిసారిగా మెగాఫోన్ పట్టుకుంటూ, స్వయంగా దర్శకత్వం వహిస్తున్న మోస్ట్ అవేటెడ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా చిత్రం రియాలిటీ (Reality). ఈ చిత్రంలో దేవిక భట్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 న రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఇక ఆలోపు సినిమాపై హైప్ పెంచడానికి కిరణ్.. లిరికల్ సాంగ్స్ ని దింపుతున్నాడు.


తాజాగా రియాలిటీ నుంచి మొదటి లిరికల్ సాంగ్ కి ముహూర్తం ఫిక్స్ చేశారు. భజగోవిందం అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేశారు. టైటిల్ కి తగ్గట్టే ఈ సాంగ్ లిరిక్స్ చాలా రియల్ గా ఉన్నాయి. 'ఉన్నంతలో మనకు ఉన్నంతలో బతికితే అదే సుఖము.. ఎవరికి తలవంచకా నీ కాళ్ళపై నువ్వు నిలబడే గుణమే వరము' అంటూ వచ్చే లిరిక్స్ ప్రతి మనిషిని కట్టిపడేస్తాయి అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు.


సాధారణ కుటుంబాల్లోని చిన్న చిన్న సంతోషాలు, అనుబంధాలు, కష్టసుఖాలను ప్రతిబింబించేలా ఈ పాట సాగుతుంది. ఇక రద్దీగా ఉండే మార్కెట్లు, అందమైన కుటుంబ క్షణాలు, జీవన సౌందర్యాన్ని ప్రతిబింబించే ఈ విజువల్స్ ప్రేక్షకులను ఇన్‌స్టంట్‌గా కనెక్ట్ చేసుకునేలా ఉన్నాయి. ఈ చిత్రంలోని ఫుల్ సాంగ్ అక్టోబర్ 22న విడుదల కానున్నట్లు మేకర్స్ తెలిపారు. భీమ్స్ సిసిరోలియో అందించిన ఫోక్-రూటెడ్ మ్యూజిక్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ఆ లిరిక్స్ విన్నవారందరూ.. నిజంగా ఇదే కదా బతకడం అంటే.. ఏం లిరిక్స్ రా బాబు పోవడంలేదు మైండ్ లో నుంచి అని కామెంట్స్ చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద రియాలిటీ ఒక ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా నిలవడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి కిరణ్ హీరోగానే కాకుండా డైరెక్టర్ గా కూడా విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.

Updated Date - Oct 19 , 2026 | 11:56 AM