లెనిన్.. భారతిగా శ్రీలీల ఉండి ఉంటేనా..
ABN , Publish Date - Jul 11 , 2026 | 05:48 PM
పండించే ప్రతి గింజ మీద తినేవాడి పేరు రాసి ఉంటుందట.. అలాగే ఇండస్ట్రీలో హిట్ అయిన సినిమాలో ప్రతి పాత్ర వెనుక ఒక ఆర్టిస్టు పేరు రాసి ఉంటుంది. అది ఎన్ని అడ్డంకులు దాటుకొని అయినా వారి వద్దకే వచ్చి చేరుతోంది.
పండించే ప్రతి గింజ మీద తినేవాడి పేరు రాసి ఉంటుందట.. అలాగే ఇండస్ట్రీలో హిట్ అయిన సినిమాలో ప్రతి పాత్ర వెనుక ఒక ఆర్టిస్టు పేరు రాసి ఉంటుంది. అది ఎన్ని అడ్డంకులు దాటుకొని అయినా వారి వద్దకే వచ్చి చేరుతోంది. అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒక సినిమా హిట్ అయ్యింది అంటే.. ఆ సినిమాను ఎంతోమంది రిజెక్ట్ చేసి ఉంటారు. ఆ సినిమా హిట్ అయ్యాక కానీ, అవి బయటపడవు. కానీ, లెనిన్ (Lenin) సినిమా విషయానికి వస్తే శ్రీలీల (Sreelela) ఒక మంచి హిట్ ని చేజార్చుకుంది అని చెప్పొచ్చు. ఇంకా ఘాటుగా చెప్పాలంటే.. భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) కోసమే ఆమె తప్పుకుందేమో అని చెప్పొచ్చు.
అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లెనిన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన భాగ్యశ్రీ బోర్సేకు ప్రశంసలు దక్కుతున్న సమయంలో నెటిజన్లు ఒక్కసారిగా శ్రీలీల పేరును తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. లెనిన్ లో మొదట మేకర్స్ అనుకున్న హీరోయిన్ శ్రీలీల. కొంతవరకు షూటింగ్ జరగడమే కాకుండా అమ్మడి పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. కాకపోతే ఆ తరువాత ఈ సినిమా నుంచి శ్రీలీల తప్పుకొని భాగ్యశ్రీ ఎంటర్ అయ్యింది. ఇప్పుడు భాగ్యశ్రీ నటన చూశాక.. ఆమెనే బెస్ట్ ఛాయిస్ అని, ఒకవేళ శ్రీలీల ఉండి ఉంటే ఈ పాత్రకు ఇంత ఎఫెక్ట్ వచ్చేది కాదంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే ప్రాక్టికల్ గా ఆలోచిస్తే.. శ్రీలీల ఈ సినిమా నుంచి తప్పుకోకుండా భారతిగా నటించి ఉన్నా సినిమా రిజల్ట్ లో మార్పు ఉండేదా అంటే ఉండేది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే.. ఇప్పుడు రిలీజ్ అయిన లెనిన్ కథ.. శ్రీలీల ఉన్నప్పుడు ఉన్న లెనిన్ కథ వేరు అని టాక్ నడుస్తోంది. మొదట ఈ సినిమాని పరువు హత్యల నేపధ్యంలో రాసుకున్నాడట మురళీ కిషోర్. దానికి తగ్గట్లుగానే శ్రీలీల పాత్ర, నటన వేరేలా అనుకున్నారట. కానీ, అనుకోకుండా లెనిన్ విషయంలో చాలా జరిగిపోయాయి. శ్రీలీల మారింది.. రీషూట్ లు.. ఇలా కావడంతో ఇదే స్టోరీ అయితే అంత ఇంపాక్ట్ ఉండదని, నాగార్జున కథను మార్చి.. దీనికి మహా భారతం లైన్ ని యాడ్ చేసినట్లు సమాచారం. ఇందులో భాగ్యశ్రీ పాత్రను ఎలివేట్ అయ్యేలా మార్చారు.
ఇక దీనికి తోడు.. ఇప్పటివరకు శ్రీలీలకు పెళ్లి సందడి నుంచి గుంటూరు కారం వరకు ఆమె కేవలం హీరోతో ప్రేమలో పడటం, డాన్సులు చేయడం మినహా నటనకు దక్కిన అవకాశాలు లేవు కాబట్టి.. థియేటర్ కి వెళ్ళే ప్రేక్షకుడు ఆమెను అలాంటి పాత్రలోనే ఊహించుకొనేవాడు. దానివలన అఖిలే ఆమె కంటే ఎక్కువ డామినేట్ అయ్యి అప్పుడు కూడా శ్రీలీల ట్రోల్ కంటెంట్ గానే నిలిచేది. హీరోయిన్ రాంగ్ ఛాయిస్ అని పెదవి విరిచేవారేమో.
ఇదంతా పక్కన పెడితే.. లెనిన్ అనేది.. హీరో డ్రివెన్ సబ్జెక్ట్. తనకు ద్రోహం చేసింది తనవాళ్లే అని తెలిసిన ఒక యువకుడు ప్రేమ- పగ మధ్య నలిగిపోయి.. చివరకు ధర్మమే నెగ్గాలి అనుకోని చేసే కురుక్షేత్రం. ఇందులో భాగ్యశ్రీ చేసినా.. శ్రీలీల చేసినా.. పెద్ద ఇంపాక్ట్ ఉండేది కాదు అనేది ఇంకొందరి వాదన. అయితే స్టోరీలో మెయిన్ పాయింట్ భారతి పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అందులో కొన్ని మంచి ఎమోషనల్ సీన్లు, నటనకు స్కోప్ ఉన్న సన్నివేశాలు ఉన్నాయి. వాటిని భాగ్యశ్రీ బోర్సే తన ప్రయత్న లోపం లేకుండా చాలా అద్భుతంగా నిలబెట్టింది.. అది శ్రీలీల కూడా చేయగలిగేది కానీ, ముందు నుంచి ఉన్న ట్రోలింగ్ కారణంగా ఈ రేంజ్ లో ప్రేక్షకుల ప్రశంసలు మాత్రం దక్కేవి కావు అని చెప్పొచ్చు. ఏదిఏమైనా శ్రీలీల ఈ సినిమా చేయకపోయినా.. ట్రోల్ వలన భాగ్యశ్రీ కన్నా ఎక్కువ ఫేమస్ అయ్యింది.