రామ్ నే పెళ్లి చేసుకుంటా.. ఎట్టకేలకు బయటపడిన భాగ్యశ్రీ
ABN , Publish Date - Jul 10 , 2026 | 09:11 PM
మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన అందం భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse). సినిమా హిట్ సంగతి పక్కన పెడితే.. అమ్మడి అందానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన అందం భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse). సినిమా హిట్ సంగతి పక్కన పెడితే.. అమ్మడి అందానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా తరువాత భాగ్యశ్రీకి లక్ పడిశం పట్టినట్లు పట్టింది. వరుస అవకాశాలతో అమ్మడు బిజీగా మారింది. రామ్ పోతినేని పక్కన ఆంధ్రా కింగ్ తాలూకా, దుల్కర్ సరసన కాంతలో నటించి మెప్పించింది. ఇక ఇన్ని సినిమాలు చేసినా ఈ చిన్నదానికి విజయం దక్కలేదు. ఎట్టకేలకు లెనిన్ సినిమాతో భాగ్యశ్రీ మొదటి హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.
ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. భాగ్యశ్రీ ప్రేమాయణం ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా ఎప్పుడైతే మొదలయ్యిందో.. అప్పటి నుంచి రామ్ పోతినేనితో అమ్మడు ప్రేమాయణం వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ చిన్నదాని కోసమే రామ్.. లిరిసిస్ట్ గా మారాడని కూడా పుకార్లు వచ్చాయి. ఇక ఈ పుకార్లను రామ్ ఖండించినా.. భాగ్యశ్రీ మాత్రం ఎప్పుడు ఖండించకపోగా.. ఎప్పటికప్పుడు రామ్ తోనే తన పెళ్లి అని హింట్ ఇవ్వడం మొదలుపెట్టింది. మొన్నటికి మొన్న లెనిన్ ప్రమోషన్స్ లో హైదరాబాద్ నా రెండో ఇల్లు. ఆల్రెడీ ఉంది అని చెప్పి షాక్ ఇచ్చింది.
ఆ ఒక్క మాటతో రామ్ ఫ్యాన్స్.. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు ఆ వార్తలను భాగ్యశ్రీ కన్ఫర్మ్ చేసేసింది. డేట్ అయినా.. పెళ్లి అయినా రామ్ నే చేసుకుంటా అని చెప్పేసింది. లెనిన్ ప్రమోషన్స్ భాగంగా ఒక టాక్ షోలో పాల్గొన్న భాగ్యశ్రీ.. మీరు పనిచేసిన హీరోల్లోఫ్రెండ్ షిప్, డేట్, మ్యారీ.. అంటే ఎవరి పేరు చెప్తారు అని అడగ్గా.. అఖిల్ తనకు మంచి స్నేహితుడు అని చెప్పిన ఈ చిన్నది.. డేట్, మ్యారీ రామ్ అని సిగ్గుపడుతూ పేరు చెప్పకుండానే హింట్ ఇచ్చేసింది. నేను పనిచేసిన కోస్టార్స్ అందరికీ పెళ్లి అయ్యిపోయింది. అతను ఒక్కడే సింగిల్ అని చెప్పడంతో రామ్ తోనే పెళ్లి అని డైరెక్ట్ గా చెప్పేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఇక దీంతో భాగ్యశ్రీ పోతినేని అని పేరు పెట్టేశారు. మరి రామ్ పోతినేని దీనిపై ఎలా స్పందిస్తాడో చూడాలి.