భాగ్యశ్రీ బోర్సేకు.. ఆ జాబితాలో అవకాశం ఉంది..
ABN , Publish Date - Apr 18 , 2026 | 03:57 PM
సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎదగాలంటే అందానికి తోడు అభినయం కూడా ఉండాలి. అప్పుడే అసలైన గుర్తింపు లభిస్తుంది. ఈ ఫార్ములాని మొదటి నుంచీ పాటిస్తోంది నటి భాగ్యశ్రీ బోర్సే
సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎదగాలంటే అందానికి తోడు అభినయం కూడా ఉండాలి. అప్పుడే అసలైన గుర్తింపు లభిస్తుంది. ఈ ఫార్ములాని మొదటి నుంచీ పాటిస్తోంది నటి భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse) ఆమె అందానికి, ఎట్రాక్షన్‌కు తెలుగు సినీ ప్రియులు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ బ్యూటీ సోషల్ మీడియా పోస్ట్ చేసిన ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. వేల సంఖ్యలో లైకులు, కామెంట్లతో సోషల్ మీడియా షేక్ అవుతుంది. ఫొటోలు మాత్రమే కాకుండా, డ్రెస్సింగ్ సెన్స్, మేకప్ స్టైల్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. నేచురల్‌గా ఉంటూనే ఎంతో ఆకర్షణీయంగా కనిపించే తీరు నేటితరం హీరోయిన్లలో ఒక సోషల్ మీడియా క్వీన్‌గా ఆమెను నిలబెట్టింది.
హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’తో టాలీవుడ్‌కి పరిచయమైన బెంగాలీ బ్యూటీ మొదటి ప్రయత్నంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. తదుపరి రామ్ పోతినేని సరసన నటించి అద్భుత నటనతో అలరించింది. వీరిద్దరి మధ్య కుదిరిన కెమిస్ట్రీతో రామ్ ఈ బ్యూటీకి పడిపోయాడనే టాక్ నడిచింది. ఇప్పటి వరకూ చెప్పుకోదగ్గ విజయం వరించకపోయినా అవకాశాలకు కొదవేం లేదు. ప్రస్తుతం అక్కినేని అఖిల్ సరసన ‘లెనిన్’లో నటిస్తోంది. దీనిపై అంచనాలు బాగున్నాయి. తాజాగా విడుదలైన ఫస్ట్ సాంగ్‌లో అఖిల్‌తో కలిసి స్టెప్పులు ఇరగదీసింది. దీంతో ఈ చిత్రానికి భాగ్యశ్రీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలవబోతుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో ప్రభాస్, మహేశ్, అల్లు అర్జున్ వంటి పాన్ ఇండియా స్టార్‌లతో నటించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. గ్లామర్ పాత్రలకే కాకుండా వైవిధ్యమైన పాత్రలతో నిరూపించుకోవడానికి సిద్థమవుతున్న ఈ నేచురల్ బ్యూటీ అగ్ర తారల జాబితాలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు.