Jana Nayakudu: అప్పుడే ఓటీటీలోకి జన నాయకుడు..
ABN , Publish Date - Jan 05 , 2026 | 04:49 PM
కోలీవుడ్ విజయ్ (Vijay)హీరోగా హెచ్. వినోత్( H.Vinoth) దర్శకత్వంలో తెరకెక్కిన 'జన నాయగన్ (Jana Nayagan)' మూవీ జనవరి 9వ తేదీన రిలీజ్ కానుంది.
Jana Nayakudu: కోలీవుడ్ విజయ్ (Vijay)హీరోగా హెచ్. వినోత్( H.Vinoth) దర్శకత్వంలో తెరకెక్కిన 'జన నాయగన్ (Jana Nayagan)' మూవీ జనవరి 9వ తేదీన రిలీజ్ కానుంది. తెలుగులో 'జన నాయకుడు (Jana Nayakudu)'గా ఈ సినిమా రానుంది. ఈ చిత్రానికి మాతృక బాలకృష్ణ (Balakrishna) హీరోగా అనిల్ రావిపూడి రూపొందించిన 'భగవంత్ కేసరి' అని ప్రచారం సాగింది. 'జన నాయకుడు' ట్రైలర్ చూస్తే అది నిజమే అనిపిస్తోంది. దాంతో 'జన నాయకుడు' విడుదలవుతున్న సమయంలో 'భగవంత్ కేసరి'ని ఓటీటీలో జనం ఆసక్తిగా చూడడం విశేషంగా మారింది. ఓ సినిమా ఓటీటీలోకి వచ్చి ఇన్ని రోజులయిన తరువాత కూడా ఇంత ఆదరణ పొందడం అన్నది 'భగవంత్ కేసరి'కే చూస్తున్నామని అమేజాన్ ప్రైమ్ వెల్లడించింది... అలా ప్రస్తుతం అమేజాన్ లో స్ట్రీమింగ్ అవుతున్న నంబర్ వన్ మూవీగా 'భగవంత్ కేసరి' నిలవడం విశేషంగా మారింది.
'జన నాయకుడు' సినిమా కారణంగా 'భగవంత్ కేసరి'కి ఓ స్పెషల్ క్రేజ్ రావడం పట్ల సినీఫ్యాన్స్ లో ప్రత్యేకమైన చర్చ సాగుతోంది... విజయ్ రాజకీయరంగంలో అడుగు పెట్టి రాబోయే తమిళనాడు ఎన్నికల బరిలో పోటీ చేస్తున్నారు. అందువల్ల తమిళనాట 'జన నాయగన్'కోసం ఆయన ఫ్యాన్స్ తోపాటు, ఇతర మూవీ బఫ్స్ సైతం ఆసక్తి ఎదురుచూడడం పరిపాటే!. అయితే 'జన నాయకుడు'కారణంగా 'భగవంత్ కేసరి'కి ఊపు రావడానికి కూడా విజయ్ పాలిటిక్స్ కారణమని పరిశీలకులు అంటున్నారు... అయితే 'భగవంత్ కేసరి' సినిమాను యథాతథంగా అనుసరించకుండా కొన్ని మార్పులూ చేర్పులూ చేసినట్టు తెలుస్తోంది... విజయ్ ఇమేజ్ కు తగ్గట్టుగా, అందులోనూ ఆయన పాలిటిక్స్ కెరీర్ కు కలసి వచ్చేలా 'జన నాయకుడు' సినిమా ద్వితీయార్ధాన్ని మార్చివేశారని టాక్... అందువల్ల 'జన నాయకుడు' సినిమా తెలుగునాట కూడా విశేషాదరణ చూరగొంటుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్.
విజయ్ హీరోగా నటించడం వల్ల 'జన నాయగన్'మూవీకి విశేషమైన క్రేజ్ ఉన్న మాట వాస్తవమే... ఇక తమిళ నాట ఈ సంక్రాంతికి 'జన నాయగన్'తో పాటు 'పరాశక్తి' మాత్రమే రిలీజ్ అవుతోంది... అందువల్ల తమిళ చిత్రసీమలో 'జన నాయగన్' భారీఓపెనింగ్స్ చూస్తుందని అంటున్నారు... ఇక ఈ సినిమా ట్రైలర్ 24 గంటల వ్యవధిలో 71 మిలియన్ వ్యూస్ సాధించి, టాప్ ఫైవ్ ఇండియన్ మూవీస్ లో ఒకటిగా నిలచింది... ఇప్పటికీ ప్రభాస్ 'సలార్' 119 మిలియన్ వ్యూస్ తో నంబర్ వన్ ప్లేస్ లోనే నిలచింది... దాని తరువాతి స్థానాల్లో 'కేజీఎఫ్-2', 'పుష్ప-2', 'ఆదిపురుష్' చిత్రాలు ఉన్నాయి.
ఇంత క్రేజ్ ఉన్న 'జన నాయగన్'ను ఫిబ్రవరి 6వ తేదీనే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారని విశేషంగా వినిపిస్తోంది... నెలలోపే 'జన నాయగన్' ఓటీటీలో ప్రత్యక్షం కాబోవడంపై పలు రకాలుగా వినిపిస్తోంది... సినిమాలో దమ్ము లేదా అన్నది కొందరిమాట... అదేం కాదు- ఏప్రిల్-మే నెలల్లో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు సాగనున్నాయి... ఈ నేపథ్యంలోనే ఓ పథకం ప్రకారం ముందుగానే సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారని వినిపిస్తోంది... అలా చేయడం వల్ల విజయ్ పార్టీ 'తమిళగా వేట్రి కళగం'కి మంచి ఆదరణ లభిస్తోందనీ కొందరు చెబుతున్నారు... మరి వీటిలో నిజానిజాలేవో కానీ, జనవరి 9న రాబోతున్న 'జన నాయగన్' ఏ తీరున జనాలను ఆకట్టుకుంటుందో చూడాలి.