తెలంగాణ సీఎంను కలిసిన బెల్లంకొండ కుటుంబ సభ్యులు..
ABN , Publish Date - Apr 25 , 2026 | 09:44 PM
బెల్లంకొండ సురేశ్ తనయుడు సాయి శ్రీనివాస్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నారు.
బెల్లంకొండ సురేశ్ తనయుడు సాయి శ్రీనివాస్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నారు. ఇటీవల కావ్యారెడ్డితో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే! ఏప్రిల్ 29న తిరుమలలో వివాహం జరగనుంది. ఇప్పటికే శుభలేఖలు పంచడం ప్రారంభించారు. శనివారం బెల్లంకొండ సురేశ్ కుటుంబ సభ్యులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయి శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అక్కినేని నాగార్జునను కూడా పెళ్లికి ఆహ్వానించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.