బెల్లంకొండ శ్రీనివాస్.. కావ్యారెడ్డి నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్
ABN , Publish Date - Apr 05 , 2026 | 09:20 PM
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ పెద్ద కుమారుడు సాయి శ్రీనివాస్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. హైదరాబాద్ కు చెందిన కావ్య రెడ్డితో ఏడు అడుగులు వేయనున్నారు.
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ పెద్ద కుమారుడు సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. హైదరాబాద్ కు చెందిన కావ్య రెడ్డితో ఏడు అడుగులు వేయనున్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. ఈ కార్యక్రమానికి బెల్లంకొండ సురేష్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అతి తక్కువ మంది అతిథుల హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మార్చి నెలలో తనకు కాబోయే భార్య కావ్య రెడ్డిని పరిచయం చేశారు సాయి. ఈ నెల 29వ తేదీన తిరుపతిలో కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరగనుంది.