Prabhakar: క్ష‌మించండి.. నా ఫ్యామిలీని తిట్ట‌కండి! మా అబ్బాయిని.. పద్దతిగానే పెంచాను

ABN , Publish Date - Feb 07 , 2026 | 08:59 PM

న‌టుడు ప్ర‌భాక‌ర్ కుమారుడు చంద్ర‌హాస్ హీరోగా రూపొంది ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చిన చిత్రం బ‌రాబ‌ర్ ప్రేమిస్తా.

Prabhakar

టీవీ న‌టుడు ప్ర‌భాక‌ర్ (Prabhakar) కుమారుడు చంద్ర‌హాస్ (Chandrahass) హీరోగా రూపొంది ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చిన చిత్రం బ‌రాబ‌ర్ ప్రేమిస్తా (Barabar Premistha). అయితే.. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సంద‌ర్భంగా చంద్ర‌హాస్ అత్యుత్సాహంతో సినిమాలోని పాట‌కు సొంత ప‌ద‌జాలం ఉప‌యోగించి బూతుల‌తో పాట‌ పాడి అక్క‌డికి వ‌చ్చిన వారిని, టీవీ ఎదుట చూస్తున్న వారిని షాక్ గురి చేశాడు. ఆపై.. అది కాస్త వైర‌ల్‌గా మారి పెద్ద ర‌చ్చే జ‌రుగ‌గా తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఓ మీడియా ప్ర‌తినిధి స‌ద‌రు పాట‌పై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ పాట పాడిన వారు త‌ప్ప‌క క్ష‌మాప‌ణ చెప్పాల్సిందే అని ఆగ్ర‌హం కూడా వ్య‌క్తం చేశాడు. అది ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో పెద్ద చ‌ర్చ‌కే దారి తీస్తోంది.

అంతేగాక‌.. ఈ క్ర‌మంలో అనేక మంది చంద్ర‌హాస్ పెరిగిన విధానం, పెంప‌కం గురించి కూడా విమ‌ర్శ‌లు వెళ్లువెత్తాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా శ‌నివారం ప్ర‌భాక‌ర్ తెర ముంద‌కు వ‌చ్చి అంద‌రికీ క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. మా అబ్బాయి తప్పు చేశాడు.. నేను అతనికి ఆ విషయం చెప్పాను. కానీ అతనిని తప్పు ఎత్తి చూపే క్రమంలో కొందరు తప్పులు చేశారు.. నా ఫ్యామిలీ గురించి బ్యాడ్‌గా మాట్లాడారు. మా అబ్బాయిని నేను పద్దతిగానే పెంచాను. అతను మాట్లాడిన ఓ బూతు పదంతో అంచనాలకు రాకూడద‌ని కోరారు.

నేను పిలవగానే ఆ రోజు ఈవెంట్‌కు జేడీ చ‌క్ర‌వ‌ర్తి, ద‌ర్శ‌కుడు జయంత్ గారు గెస్టులుగా వచ్చారు.. నా వల్ల మాటలు పడాల్సి వచ్చిన జెడి చక్రవర్తి, జయంత్ సి పరాన్జీకి క్షమాపణలు తెలుపుతున్నా అన్నారు. ప్ర‌స్తుతం సినిమా థియేట‌ర్ల‌లో ఉంద‌ని.. మా అబ్బాయి చంద్ర‌హాస్ న‌ట‌న గురించి మెచ్చుకుంటున్నార‌ని ఎమోష‌న‌ల్ అయ్యాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్‌ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

Updated Date - Feb 07 , 2026 | 09:08 PM