Chandrahaas: ఫిబ్రవరి మొదటి వారంలో 'బరాబర్ ప్రేమిస్తా'

ABN , Publish Date - Jan 22 , 2026 | 05:16 PM

చంద్రహాస్, మేఘన ముఖర్జీ జంటగా నటించిన 'బరాబర్ ప్రేమిస్తా' చిత్రం ఫిబ్రవరి 6న జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో కాలేజీ స్టూడెంట్స్ సమక్షంలో రిలీజ్ డేట్ పోస్టర్ ను విడుదల చేశారు.

Barabar Premista Movie

యువ కథానాయకుడు చంద్రహాస్‌ నటించిన కొత్త చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. సంపత్ రుద్ర దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ సమర్పణలో గెడా చందు, గాయత్రి చిన్ని, ఏవీఆర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ హీరోయిన్‌గా తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెడుతోంది. అలానే 'ఇష్టంగా' ఫేమ్ అర్జున్ మహీ ఇందులో విలన్ గా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాను ఫిబ్రవరి 6న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను హైదరాబాద్ లోని బ్రిలియంట్ గ్రూప్ ఆఫ్‌ కాలేజీస్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ తో కలిసి హీరో, హీరోయిన్లు డాన్స్ చేసి వారిలో సరికొత్త జోష్‌ నింపారు.


ఈ సందర్భంగా చంద్రహాస్‌ మాట్లాడుతూ, 'మా సినిమా ప్రమోషన్స్ ఈ కాలేజీ నుంచే స్టార్ట్ చేస్తున్నాం. మీ అందరినీ చూస్తుంటే చాలా ఎనర్జీ వచ్చేస్తోంది. ఫిబ్రవరి 6న 'బారాబర్ ప్రేమిస్తా' సినిమాతో విక్టరీ కొట్టబోతున్నాం' అని అన్నారు. హీరోయిన్ మేఘన ముఖర్జీ మాట్లాడుతూ, ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 'ఒక ఊరిలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కొట్టుకుంటే ఎలా ఉంటుందనేదే 'బారాబర్ ప్రేమిస్తా' సినిమా అని, ప్యూర్ తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన వినోదాత్మక చిత్రమిద'ని దర్శకుడు సంపత్ రుద్ర చెప్పారు. ఈ సినిమాకు ఎం.ఎ. తిరుపతి కథను అందించగా, ఆర్.ఆర్. ధ్రువన్ సంగీతం సమకూర్చారు.

Updated Date - Jan 22 , 2026 | 05:16 PM