Bandla Ganesh: నా మనసు కుదుటపడింది.. మొక్కు తీర్చుకోబోతున్నా..  

ABN , Publish Date - Jan 18 , 2026 | 12:44 PM

నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ (Bandla Ganesh) తిరుమలకు పాదయాత్ర చేపట్టనున్నారు.

నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ (Bandla Ganesh) తిరుమలకు పాదయాత్ర చేపట్టనున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు (N Chandrababu Naidu) అరెస్టైన సంగతి తెలిసిందే. 'చంద్రబాబుపై వేసిన అభాండాలు తొలగిపోవాలని.. జైలు నుంచి ఆయన బయటకు రావాలని సుప్రీంకోర్టు గడపపై నిలుచుని శ్రీవేంకటేశ్వరస్వామిని ప్రార్థించా. నా గడప నుంచి నీ కొండ దాకా పాదయాత్ర’ చేస్తానని మొక్కుకున్నా. ఆ   మొక్కును ఇప్పుడు తీర్చుకోబోతున్నాను' అని గణేష్  తెలిపారు. ఈనెల 19న ఉదయం 9 గంటలకు షాద్‌నగర్‌లోని తన నివాసం నుంచి ‘సంకల్ప యాత్ర’ ప్రారంభిస్తానని బండ్ల గణేశ్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు.

 bandla.jpg

Updated Date - Jan 18 , 2026 | 12:47 PM