Bandla Ganesh: పవన్ కళ్యాణ్.. సచ్చేదాకా వదిలిపెట్టను

ABN , Publish Date - May 21 , 2026 | 03:15 PM

సాధారణంగా హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు. కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కి భక్తులు మాత్రమే ఉంటారు. అలాంటి భక్తుల్లో అతిపెద్ద భక్తుడు నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bnadla Ganesh) అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

Bandla Ganesh

సాధారణంగా హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు. కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కి భక్తులు మాత్రమే ఉంటారు. అలాంటి భక్తుల్లో అతిపెద్ద భక్తుడు నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bnadla Ganesh) అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈశ్వరా.. పరమేశ్వరా.. పవరేశ్వరా.. ఇలాంటి ప్రేమను పవన్ కళ్యాణ్ పై చూపి ఆయన రేంజ్ ను మరింత పెంచారు. వీరిద్దరి మధ్య స్నేహ బంధం కూడా అలాగే ఉండేది. అయిది కొన్నేళ్ళ క్రితం నుంచి వీరి స్నేహానికి బ్రేక్ పడింది. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. పవన్ రాజకీయాల్లో బిజీగా మారడం, వీరి మధ్యలోకి త్రివిక్రమ్ రావడం.. ఇలా పలు కారణాలు పవన్- బండ్ల గణేష్ ని కలవనివ్వకుండా చేశాయి.


బండ్ల గణేష్.. సోషల్ మీడియాలో పవన్ గురించి ఎప్పుడు చెప్పుకొస్తూనే ఉంటారు. ఆయనే తన దేవుడు అంటూ పోస్టులు పెడుతూనే ఉంటారు. అయితే పవన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి బండ్ల గణేష్ రావడం మానేయడంతో వీరిద్దరి మధ్య అగాధం పెరిగిందని అనుకున్నారు. కానీ, చాలా కాలం తరువాత పవన్ - బండ్ల గణేష్ కలిశారు. దీనికి వేదికగా నిలిచింది మెగా 158 పూజా వేడుక. చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం మెగా 158. ఈ సినిమా ప్రారంభోత్సవం అన్నపూర్ణ సినీస్టూడియోస్ లో గురువారం జరిగింది... ఈ వేడుకలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.


ఇక బండ్ల గణేష్ సైతం మెగా 158 పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ పవన్ కళ్యాణ్ ని కలిసి కొద్దిసేపు ముచ్చటించారు. చాలాకాలం తరువాత వీరిద్దరూ కలిసి కనిపించడం అభిమానులకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇక పవన్ తో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బండ్లన్న ఎమోషనల్ అయ్యారు. 'నేను సామాన్యంగా ఎవరినీ ప్రేమించను… ఒక్కసారి ఒక మనిషిని మనస్ఫూర్తిగా ఇష్టపడితే, సచ్చేదాకా వదిలిపెట్టను… నువ్వంటే నాకిష్టం బాస్…' అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ఇద్దరి కాంబోలో గబ్బర్ సింగ్ లాంటి హిట్ సినిమా వచ్చింది. మరి త్వరలోనే ఈ కాంబోలో ఇంకో సినిమా వస్తుందేమో చూడాలి.

Updated Date - May 21 , 2026 | 03:33 PM