దేశం వదిలి వెళ్ళిపోతున్న చిన్నారి పెళ్ళికూతురు

ABN , Publish Date - May 10 , 2026 | 05:31 PM

చిన్నారి పెళ్ళికూతురు సీరియల్ తో ప్రేక్షకులకు దగ్గరైన నటి అవికాగోర్ (Avika Gor). బాలనటిగా కెరీర్ ని ప్రారంభించిన ఆమె హీరోయిన్ గా తెలుగులో ఉయ్యాలా జంపాల, సినిమా చూపిస్తా మావా, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Avika Gor

చిన్నారి పెళ్ళికూతురు సీరియల్ తో ప్రేక్షకులకు దగ్గరైన నటి అవికాగోర్ (Avika Gor). బాలనటిగా కెరీర్ ని ప్రారంభించిన ఆమె హీరోయిన్ గా తెలుగులో ఉయ్యాలా జంపాల, సినిమా చూపిస్తా మావా, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుస అవకాశాలను అందుకున్నా కూడా అవికా హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది. ఇక సినిమాలు పక్కన పెట్టి సిరీస్ లు చేస్తూ వచ్చింది.


గతేడాది అవికా.. పెళ్ళిపీటలు ఎక్కిన విషయం తెల్సిందే. దాదాపు ఏడేళ్ళు ప్రేమించిన మిలింద్ చంద్వానిని వివాహమాడింది. ఇక ఇప్పుడు అవికా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తాను బ్యాంకాక్‌కు శాశ్వతంగా షిఫ్ట్ అయినట్లు తాజా ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేసింది. ఇప్పటికే పెళ్లి తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించిన అవికా, ఈ మార్పును ఒక కొత్త ఎక్సైటింగ్ ఫేజ్‌గా చూస్తున్నాను అని, ఇది పెద్ద మార్పు కాదు.. ఒక న్యాచురల్ స్టెప్ లాంటిదే అని చెప్పుకొచ్చింది.


తన భర్త మిలింద్ చంద్వాని కెరీర్ అవకాశాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని, అక్కడే ఒక ఇల్లు కూడా కొనుగోలు చేసినట్లు తెలిపిన అవికా తమ ఇద్దరి కెరీర్‌లకు ఒకరినొకరు సపోర్ట్ చేయడం చాలా ముఖ్యమని తెలిపింది. మిలింద్‌కు అక్కడ మంచి అవకాశాలు ఉన్నందున, అతని గ్రోత్‌కు అడ్డుగా తాను ఉండకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అయితే, ఈ విషయమై ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అవికా క్లారిటీ ఇచ్చింది. బ్యాంకాక్‌లో బేస్ మార్చుకున్నా.. టీవీ, సినిమాల్లో తన పనులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. అవసరానికి అనుగుణంగా హైదరాబాద్, ముంబైకి ట్రావెల్ చేస్తూనే ఉంటానని చెప్పింది.

Updated Date - May 10 , 2026 | 05:48 PM