బాలయ్య డైలాగ్‌తో టైటిల్.. ఇప్పుడు బాలయ్య వాయిస్‌తో ట్రైలర్..
ABN , Publish Date - Sep 21 , 2026 | 04:11 PM
“డోంట్ ట్రబుల్ ద ట్రబుల్.. ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్.. ట్రబుల్ ట్రబుల్స్ యూ.. ఐయామ్ నాట్ ద ట్రబుల్.. ఐయామ్ ద ట్రూత్”.. నందమూరి బాలకృష్ణ చెప్పిన ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు
“డోంట్ ట్రబుల్ ద ట్రబుల్.. ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్.. ట్రబుల్ ట్రబుల్స్ యూ.. ఐయామ్ నాట్ ద ట్రబుల్.. ఐయామ్ ద ట్రూత్”.. నందమూరి బాలకృష్ణ చెప్పిన ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా డైలాగ్‌గా మొదలైనది.. మీమ్స్‌లోనూ వైరల్ అయింది. ఇప్పుడు ఏకంగా ఓ సినిమా టైటిల్‌గా మారిపోయింది. అంతేకాదు.. ఆ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాలో బాలయ్యే భాగమవుతుండటం ఆసక్తికరంగా మారింది. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ కథానాయకుడిగా ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’. ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచగా.. ఇప్పుడు ట్రైలర్‌తో మరో సర్‌ప్రైజ్ ఇవ్వడానికి చిత్రబృందం సిద్ధమైంది. ఈ సినిమా ట్రైలర్‌కు నందమూరి బాలకృష్ణ వాయిస్ ఓవర్ అందించనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు.
దీంతో ట్రైలర్‌లో బాలయ్య వాయిస్ ఎలా ఉండబోతుంది? ఆయన వాయిస్ ఓవర్ సినిమాపై ఎలాంటి ఆసక్తిని పెంచుతుంది. బాలకృష్ణకు ఆర్కా మీడియా సంస్థతో పాటు నిర్మాత కార్తికేయతోనూ మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే ట్రైలర్‌కు వాయిస్ ఓవర్ అందించేందుకు బాలయ్య ముందుకు వచ్చారట. మరోవైపు ఈ సినిమాకు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కూడా తనవంతుగా క్రియేటివ్ ఇన్‌పుట్స్ అందించినట్లు సమాచారం. సినిమా ప్రమోషన్స్‌ను కూడా సాధారణ పద్ధతికి భిన్నంగా నిర్వహించాలని చిత్రబృందం భావిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. అయితే ఆ సమయంలో ఫహాద్ ఫాజిల్ అందుబాటులో లేకపోవడంతో ఆయన పాల్గొనలేదు. ఈసారి మాత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ఫహాద్ ఫాజిల్ హాజరుకానున్నారు.