NBK 111: మార్చిలో సెట్స్ మీదకు 'ఎన్‌బీకే 111'
ABN , Publish Date - Feb 07 , 2026 | 07:28 AM
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ చిత్రం ఎంతగా విజయం సాధించిందో తెలిసిందో. ఇప్పుడు ఇదే కలయికలో మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు.
నందమూరి బాలకృష్ణ(NBK 111), గోపీచంద్ మలినేని (gopichand Malineni) కాంబినేషన్‌లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ చిత్రం ఎంతగా విజయం సాధించిందో తెలిసిందో. ఇప్పుడు ఇదే కలయికలో మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. 'ఎన్‌బీకే 111' వర్కింగ్ టైటిల్‌తో వెంకట సతీశ్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం మొదట ఓ చారిత్రక కథను అనుకున్నప్పటికీ బడ్జెట్ తదితర కారణాల వల్ల ఆ కథను వదిలి మరో ఫ్రెష్ కథతో ఈ సినిమాను సిద్ధం చేయనున్నారు. ఇదొక స్టైలిష్ ఎంటర్‌టైనర్ అని చిత్ర బృందం ముందే ప్రకటించింది.
అయితే తాజా సమాచారం ప్రకారం ముంబై నేపథ్యంలో సాగే స్టైలిష్ మాస్ యాక్షన్‌గా ఈ చిత్రం రూపొందనుందని తెలిసింది. గత చిత్రాల్లా కాకుండా బాలకృష్ణ ఈ సినిమాలో సింగిల్ క్యారెక్టర్‌లో కనిపింంచనున్నారట. మార్చి మొదటి వారం నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించనుంది. బాలయ్య, నయన్ కలిసి శ్రీరామరాజ్యం, సింహా, జైసింహా చిత్రాల్లో నటించి హ్యాట్రిక్ అందుకున్నారు. ఇప్పుడు ఈ చిత్రంతో డబుల్ హ్యాట్రిక్‌కు శ్రీకారం చుట్టారు. గతేడాది బాలకృష్ణ ‘అఖండ-2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు ఆశించిన ఫలితం దక్కలేదు.