బాల‌య్య రూటే.. స‌ప‌రేటు! NBK.. సంచ‌ల‌న నిర్ణ‌యం

ABN , Publish Date - Apr 26 , 2026 | 07:31 PM

సినిమా ఫలితంతో సంబంధం లేకుండా కోట్లకు కోట్లు డిమాండ్ చేసే హీరోలు ఉన్న ఈ రోజుల్లో.. ఒక స్టార్ హీరో తన పంథాను మార్చుకున్నారు.

Balakrishna

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక గ్లామర్ ప్రపంచం.. ఇక్కడ ఒక హిట్టు పడిందంటే చాలు, హీరోల రెమ్యునరేషన్లు ఆకాశాన్ని తాకుతాయి. ఒక్కోసారి సినిమా ఫలితంతో సంబంధం లేకుండా కోట్లకు కోట్లు డిమాండ్ చేసే హీరోలు ఉన్న ఈ రోజుల్లో.. ఒక స్టార్ హీరో తన పంథాను మార్చుకున్నారు. తను నమ్మిన నిర్మాత నష్టపోకూడదని, ఏకంగా తన పారితోషికాన్ని తగ్గించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ హీరో మరెవరో కాదు.. నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna).

నిజానికి బాలయ్య ఇప్పుడున్న ఫామ్ చూస్తే, ఆయన అడిగినంత ఇచ్చేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారు. అఖండ నుంచి మొదలైన ఆయన జైత్రయాత్ర వరుస విజయాలతో దూసుకుపోయింది. కానీ, గతేడాది వచ్చిన అఖండ-2 (Akhanda) విషయంలో లెక్కలు కొంచెం మారాయి. దాదాపు 125 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, మిక్స్‌డ్ టాక్ రావడంతో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. దీంతో ఈ చిత్రం నిర్మాతలకు భారీ నష్టాన్ని మిగిల్చింది. సాధారణంగా ఏ హీరో అయినా సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా తన అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు తీసుకుంటారు. కానీ బాలయ్య రూటే వేరు. సినిమా పోతే నిర్మాత రోడ్డున పడకూడదనేది ఆయన సిద్ధాంతం.

గతంలో అఖండ-2 కోసం 40 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న బాలయ్య, ఇప్పుడు గోపీచంద్ మలినేని (Gopichand malineni) తో చేస్తున్న సినిమా కోసం ఏకంగా 10 కోట్ల రూపాయలను తగ్గించుకున్నారట. అంటే దాదాపు 30 కోట్లకు ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో బాలయ్య ఒక పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నారట. 'వీరసింహారెడ్డి' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ కాంబో రిపీట్ అవుతుండటంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. పారితోషికం తగ్గించుకుని నిర్మాతకు ఊపిరి పోసిన బాలయ్య తీరు చూసి ఇండస్ట్రీ మొత్తం "బాలయ్యా.. నువ్వు తోపు అంతే!" అంటూ ప్రశంసలు కురిపిస్తోంది.

అంతేకాదు, బాలయ్య ఫ్యూచర్ లైనప్ కూడా మామూలుగా లేదు. ఆయన డేట్స్ కోసం స్టార్ డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. వివేక్ ఆత్రేయ, క్రిష్ వంటి దర్శకులతో చర్చలు జరుగుతుండగా.. క్రేజీ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా దాదాపు ఖరారైపోయింది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మే 1వ తేదీన పూజా కార్యక్రమాలతో రాబోతుంది. జూన్ లేదా జూలై నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. హిట్టు వచ్చినా.. ఫ్లాపు వచ్చినా.. నిర్మాత శ్రేయస్సు కోరే ఇలాంటి హీరోలు ఉండటం ఇండస్ట్రీకి ఎంతో ప్లస్.

Updated Date - Apr 26 , 2026 | 07:31 PM