సాయి పల్లవి పాట.. మరోసారి డ్యాన్స్ ఇరగదీసిన నందమూరి తేజస్విని
ABN , Publish Date - Jul 13 , 2026 | 08:31 AM
రెండు నెలల క్రితమే డ్యాన్స్ వీడియోతో సర్‌ప్రైజ్ చేసిన తేజస్వనీ మరోసారి అదే రీతిలో అదరగొట్టి వీక్షకులను అశ్చర్య చకితులను చేసింది.
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వాళ రేపు అంటూ వాయిదాలు పడి నందమూరి అభిమానులను తీవ్రంగా నిరాశకు గురి చేస్తున్నా చిన్న కుమార్తె తేజస్విని (Tejaswini Nandamuri) మాత్రం అప్పుడప్పుడు తెర ముందుకు వచ్చి ఆ లోటును కాస్త పూడుస్తోంది. తండ్రి, ఫ్యామిలీ వారసత్వం తీసుకోనప్పటికీ ఓ రాజకీయ నేత భార్యగా, ఓ పిల్లాడికి తల్లిగా బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తూనే తెరవెనుక తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటోంది. ఈ మధ్యే సినిమా నిర్మాణ రంంగంలోకి అడుగిడడమే గాక తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన ప్రతిష్టను ఇనుమడింప జేస్తోంది.
అయితే.. ఎప్పుడు బాహ్య ప్రంపంచానికి దూరంగా ఉంటూ వస్తోన్న తేజస్వినీ ఇటీవల అడపాదడపా తనదైన మార్క్ డ్యాన్సులతో ఆకట్టుకుంటుంది. రెండు నెలల క్రితమే కొరియోగ్రాఫర్ భాను మాస్టర్‌తో కలిసి చేసిన డ్యాన్స్ వీడియోతో అందరికీ షాక్ ఇస్తూ సర్‌ప్రైజ్ చేసిన తేజస్వనీ మరోసారి అదే రీతిలో అదరగొట్టి వీక్షకులను అశ్చర్య చకితులను చేసింది. దీంతో బాలయ్య అభిమానులు తేజస్వినీ డ్యాన్స్ స్కిల్స్‌కు మంత్రముగ్దులవుతున్నారు.
తాజాగా నాగ చైతన్య, సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన లవ్ స్టోరి (Love Story) సినిమాలో సింగర్ మంగ్లీ (Mangli) ఆలపించిన బహుళ ప్రాచూర్యం పొందిన ఫోక్ సాంగ్ సారంగధరియా (Saranga Dariya) పాటకు స్టెప్పులేసి వావ్ అనిపించింది. ఈ వీడియో చూసిన వారంతా ఇంత టాలెంట్ లోపల ఉంచుకుని ఇన్నాళ్లు ఎక్కడ దాక్కున్నావ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరేమో సాయి పల్లవి గారు.. డ్యాన్స్‌లో మీకు కాంపిటీషన్ వస్తుందేమో జాగ్రత్తగా ఉండండి అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట రచ్చ రచ్చ చేస్తోంది. మీరూ ఓ లుక్ వేయండి.