SVC61: ఎల్లమ్మ అప్డేట్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు
ABN , Publish Date - Jan 13 , 2026 | 05:39 PM
బలగం (Balagam) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారాడు జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి (Venu Yeldandi). ఇక ఈ సినిమాతో వేణుతో సినిమా చేయడానికి హీరోలు మొత్తం ఊవిళ్లూరారు. బలగం సినిమాను శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించారు.
SVC61: బలగం (Balagam) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారాడు జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి (Venu Yeldandi). ఇక ఈ సినిమాతో వేణుతో సినిమా చేయడానికి హీరోలు మొత్తం ఊవిళ్లూరారు. బలగం సినిమాను శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించారు. మొదటి సినిమా మంచి విజయాన్ని అందించడంతో దిల్ రాజు.. వేణుకు ఇంకో ఛాన్స్ ఇచ్చాడు. తన బ్యానర్ లోనే వేణు.. రెండో సినిమాగా ఎల్లమ్మను మొదలుపెట్టాడు. ఎల్లమ్మ కథ మొదట నాని దగ్గరకు వెళ్లడం.. ఆయన కూడా ఒప్పుకోవడం జరిగాయి. ఆ తరువాత ఎల్లమ్మ నుంచి తప్పుకున్నట్లు నాని అధికారికంగా ప్రకటించాడు.
ఇక నాని తప్పుకున్నాకా.. ఎల్లమ్మ స్టార్ హీరోల చేతులు మారుతూ వచ్చింది. శర్వానంద్, నితిన్, బెల్లంకొండ శ్రీనివాస్.. ఇలా చాలా పేర్లు వినిపించాయి. చివరికి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కి సెట్ అయ్యింది. ఎప్పటి నుంచో దేవి.. హీరోగా ఎంట్రీ ఇవ్వాలని పరితపిస్తున్నాడు. ఇక ఆ తపన ఎల్లమ్మతో తీరబోతుందని తెలుస్తోంది. ఇప్పటివరకు ఆ హీరో .. ఈ హీరో అనుకోవడమే అప్ప మేకర్స్ మాత్రం అధికారికంగా ప్రకటించింది లేదు.
తాజాగా వేణు.. తన తదుపరి సినిమా అప్డేట్ ఇచ్చాడు. ఎల్లమ్మ గ్లింప్స్ ను జనవరి 15 న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. తన మొదటి సినిమా బలగంను ఆదరించినందుకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. బలగం జ్ఞాపకాలను జీవితాంతం గుర్తుంచుకుంటాను అని, ఈ సినిమాలానే తన నుంచి వస్తున్న రెండో సినిమాకు కూడా ఆదరించాలని కోరాడు. మరి ఈ గ్లింప్స్ లో ఎలాంటి ఎలిమెంట్స్ యాడ్ చేస్తాడో చూడాలి.