Baby Uha: ఇదెక్కడి ట్విస్ట్ రా మావా.. చిరుకు కొడుకుగా నటించింది అమ్మాయా
ABN , Publish Date - Jan 13 , 2026 | 07:36 PM
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), నయనతార (Nayanthara) జంటగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మన శంకరవరప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu).
Baby Uha: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), నయనతార (Nayanthara) జంటగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మన శంకరవరప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu). సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో ఇద్దరు చిన్నారులు హైలైట్ గా నిలిచారు. చిరంజీవి.. తన ఇద్దరి పిల్లల కోసం తపన పడడం ఒక ఎత్తు అయితే.. తండ్రిని హేట్ చేసే పిల్లలుగా నిక్కీ, విక్కీ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా విక్కీ.. ఎంత క్యూట్ గా ఉన్నాడు అంటే చూడగానే ఎన్టీఆర్ చిన్న కొడుకు భార్గవ్ రామ్ గుర్తొచ్చాడు అని కూడా చెప్పుకొచ్చారు.
అయితే ఆ అబ్బాయి.. అసలు అబ్బాయే కాదు. ఏంటి నిజమా.. అంటే అవును. విక్కీ అబ్బాయి కాదు అమ్మాయి. ఆ చిన్న పేరు బేబీ ఊహ. కొన్ని సినిమాల్లో అబ్బాయి పాత్రల్లో అమ్మాయిలును పెడతారు. అనిల్ రావిపూడి కూడా ఇప్పుడు అదే పని చేశాడు. బేబీ ఊహ.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించింది. భగవంత్ కేసరి, సీతారామం, ఉగ్రం, షో టైమ్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఈ సినిమా కోసం ఊహ.. తన అందమైన జుట్టును కత్తిరించుకొని అబ్బాయిగా మారింది. పాలబుగ్గలతో ఎంతో క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో అచ్చు అబ్బాయిలానే నటించి మెప్పించింది.
తాజాగా మన శంకరవరప్రసాద్ గారు థాంక్స్ మీట్ లో ఊహ లంగా జాకెట్ వేసుకొని కనిపించింది. ఇక ఊహ గురించి అనిల్ రావిపూడి చెప్తూ.. ఊహ చాలా బాగా నటించిందని, పసివాడి ప్రాణం సినిమాలో సుజిత అబ్బాయిగా నటించింది.. ఇప్పుడు ఊహ కూడా అలాగే నటించింది.. ఇది కో ఇన్సిడెంట్ అని చెప్పుకొచ్చాడు. ఈ విషయం తెలియడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. ఇదెక్కడి ట్విస్ట్ రా మావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.