'ది ప్యారడైజ్'పై బాబు మోహన్ వ్యాఖ్యలు వైరల్..

ABN , Publish Date - Nov 11 , 2026 | 06:02 PM

సీనియర్‌ నటుడు బాబూమోహన్‌ (Babu Mohan) త 'ది ప్యారడైజ్' సినిమాపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. 

సీనియర్‌ నటుడు బాబూమోహన్‌ (Babu Mohan) తనదైన కామెడీతో ఒకప్పుడు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. తాజాగా ఆయన 'ది ప్యారడైజ్' సినిమాపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. నాని (Nani) హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాబు మోహన్ ను ఓ  గెటప్‌ కోసం సంప్రదించారట.. లుక్ టెస్ట్ చేసి 'అద్బుతంగా ఉంది..  త్వరలోనే సెట్స్ కి పిలుస్తాం' అని చెప్పారట. ఆయన ఎదురు చూస్తూనే ఉన్నారు కానీ కాల్ రాలేదు.. సినిమా రిలీజ్ డేట్ రావడంతో అవాక్కవ్వడం బాబు మోహన్ వంతు అయిందట. ఈ విషయాన్ని ఆయనే తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 


ఆయన మాట్లాడుతూ "ది ప్యారడైజ్'లో ఓ పాత్ర కోసం పిలిచారు. మేకప్ టెస్ట్ చేశారు. నా కెరీర్లో లుక్ టెస్ట్ చేయడం అదే మొదటి సారి. ఎందుకో తెలీదు నేను ఆ సినిమాలో లేను. అంటే నేను పనికి రాను అనుకున్నారేమో!  లేదా ఆ పాత్రకు నాకన్నా గొప్ప నటులు దొరుకుతారనుకున్నారేమో! దరిద్రం, శని వారి వెంటపడి సినిమా ఫెయిల్ అవ్వాలని ఉందేమో అందుకే నేను ఆ సినిమాలో లేను.. ఎందుకంటే నాది లక్కీ లెగ్. గతంలో ఇవివి సత్యనారాయణ 'చెవిలో పువ్వు'  అనే సినిమా తీసాడు. అట్టర్ ప్లాప్ అయింది. ఆ వెంటనే 'ప్రేమ ఖైదీ' తీసాడు అందులో నేనున్నా.. సూపర్ హిట్ అయింది. ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయి. కానీ 'ది ప్యారడైజ్' టీం నుంచి ఫోన్ వస్తాడని చూసాను..రాలేదు కానీ.. రిలీజ్ డేట్ వచ్చింది.  సినిమా ప్లాప్ అయ్యి ఒక్క రోజు కూడా ఆడలేదు. అయితే నన్ను పిలిచి లుక్ టెస్ట్ చేసి.. సినిమాలో వేషం ఇవ్వకుండా అవమానించారు' అని కామెంట్స్ చేశారు. ప్రస్తుతం బాబూమోహన్‌ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కొందరు బాబు మోహన్ వ్యాఖ్యలను సమర్దిస్తుంటే.. కొందరు మాత్రం తప్పుబడుతున్నారు. బాబూమోహన్‌కు ఈ మాటలు తగునా? ఆయనది గోల్డెన్‌ లెగ్‌ అయితే.. ఆయన వున్న ప్రతి సినిమా హిట్‌ అయిందా?ప్యారడైజ్‌ గురించి మాట్లాడమంటే.. ఇవివి సత్యనారాయణ గురించి ఎందుకు? మేకప్‌ టెస్ట్‌ చేస్తే.. తీసుకోవాలన్న రూలేమీ లేదు. బాబూమోహన్‌ది గోల్డెన్‌ లెగ్‌ అయితే.. ప్రతి సినిమాలో ఆయన్ని  ఎందుకు తీసుకోవడం లేదు" అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

     

Updated Date - Nov 11 , 2026 | 06:07 PM