'బా బా బ్లాక్ షీప్' నుంచి శుక్రవారం ఫస్ట్ సింగిల్
ABN , Publish Date - Aug 12 , 2026 | 12:09 PM
గుణి మంచికంటి దర్శకత్వంలో వేణు దోనేపూడి నిర్మిస్తున్న 'బా బా బ్లాక్ షీప్' మూవీ అక్టోబర్ 9న విడుదల కాబోతోంది. ఇప్పటికే సినిమా టీజర్ విడుదల కాగా ఆగస్ట్ 14న ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నారు.
ఒక రోజు జరిగిన అనుకోని ఘటనతో ఆరుగురు వ్యక్తుల జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే వైవిధ్యమైన కథాంశంతో రూపుదిద్దుకుంటోంది 'బా బా బ్లాక్ షీప్'. ఈ న్యూ ఏజ్ క్రైమ్ కామెడీని దోనేపూడి చక్రపాణి సమర్పణలో వేణు దోనేపూడి నిర్మిస్తున్నారు. గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ , విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళవి, కశ్యప్, రాజా రవీంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. దాంతో మూవీపై ఆసక్తి పెరిగింది. ఓ బాక్స్, గన్ చుట్టూ కథంతా తిరుగుతుందని ఆ టీజర్ చూస్తే అర్థమౌతోంది. తాజా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. అక్టోబర్ 9న దసరాకి కాస్తంత ముందే ఈ సినిమాను జనం ముందుకు తీసుకు రాబోతున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత వేణు దోనేపూడి మాట్లాడుతూ, 'సినిమా మొత్తాన్ని మేఘాలయా రాష్ట్రంలో లోనే పూర్తి చేశాం. చిరపుంజి వంటి అద్భుతమైన లొకేషన్స్‌లోనూ చిత్రీకరించాం. మేఘాలయాలో మొత్తం సినిమా షూటింగ్ జరుపుకున్న తొలి సినిమా మాదే. అతి తక్కువ రోజుల్లోనే పక్కా ప్లానింగ్‌తో సినిమాను కంప్లీట్ చేశాం. మా డైరెక్టర్ గుణి, నటీనటులు, సాంకేతిక నిపుణులు సహా ఎంటైర్ టీమ్ సహకారంతో ఇది సాధ్యమైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సినిమాలో ఫస్ట్ సింగిల్ ను ఈ నెల 14వ తేదీ సాయంత్రం 4.14కు విడుదల చేయబోతున్నాం. 'ఆజా మేరీ జానీ' అనే హై ఎనర్జిటిక్ సాంగ్‌కు స్టీఫెన్, ఆనంద్ స్వరాలు అందించారు' అని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
‘ఇప్పుడేం సమాధానం చెబుతారు? నటుడు గోవిందపై.. భార్య సునీత సంచలన వ్యాఖ్యలు!
చిరు లీక్స్.. మెగా 158 టైటిల్ ఇదే
హీరోగా మారుతున్న కేసీఆర్ మనవడు..