Akhil Akkineni: అభిమాన హీరోని చూసిన వేళ.. వెక్కివెక్కి ఏడుస్తూ..

ABN , Publish Date - Jul 16 , 2026 | 09:05 AM

అఖిల్‌ హీరోగా నటించిన ‘లెనిన్‌’ చిత్రం సక్సెస్‌ మీట్‌ బుధవారం గుంటూరులో జరిగింది. అక్కడ అఖిల్‌కు అయ్యగారు అని ఎంతో అభిమానంగా పిలిచే వీరాభిమాని నాగరాజు స్వయంగా అఖిల్‌ను కలిశారు.

అఖిల్‌ (Akhil Akkineni) హీరోగా నటించిన ‘లెనిన్‌’ (Lenin) చిత్రం సక్సెస్‌ మీట్‌ బుధవారం గుంటూరులో జరిగింది. అక్కడ అఖిల్‌కు అయ్యగారు అని ఎంతో అభిమానంగా పిలిచే వీరాభిమాని నాగరాజు స్వయంగా అఖిల్‌ను కలిశారు. కళ్ల ఎదుట అభిమాన హీరోని చూడగానే వెక్కివెక్కి ఏడుస్తూ కాళ్లపై పడ్డాడు. వద్దని ఎంత వారించినా వినలేదు నాగరాజు. వెంటనే అతన్ని దగ్గరకు తీసుకుని ఆలింగనం చేసుకున్నారు. ‘నీ వల్లే అయ్యగారే నెం 1 అనే పేరు వచ్చింది. మళ్లీ హిట్‌ కొడదాం.’ అంటూ అఖిల్‌ నాగరాజుతో చెప్పగా.. అతను భావోద్వేగానికి లోనయ్యారు. ‘ఈసారి ఇంకా కొత్త సినిమా చేయాలి.. పెద్ద స్థాయికి వెళ్లిపోవాలి’ అంటూ అఖిల్‌ను కోరాడు. తప్పకుండా కొడదాం’ అని అఖిల్‌ నాగరాజుకు మాటిచ్చారు. ఈ వీడియోను అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్‌ అవుతోంది.

దీనిని చూసి అఖిల్‌ సింప్లిసిటీని ప్రశంసిస్తున్న నెటిజన్స్‌... ‘ఎట్టకేలకు వీరాభిమాని అయ్యగారిని కలిశాడు.’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. సక్సెస్‌ మీట్‌లో అఖిల్‌ భార్య జైనాబ్‌ కూడా పాల్గొని స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. లెనిన్‌ సక్సెస్‌ తనకెంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. మూవీ టీంకు కంగ్రాట్స్‌ చెప్పి.. అయ్యగారే నెం.1 గట్టిగా అరిచారు. ఈ చిత్రానికి మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వం వహించగా.. అఖిల్‌ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌, సితార ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్స్‌దీ నాగార్జున , నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు.

Updated Date - Jul 16 , 2026 | 10:10 AM